న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్ దుమ్ము దులిపిన కేశవ్: హ్యాట్రిక్ ప్లస్: ఇన్నేళ్ల తరువాత ఓ సౌతాఫ్రికన్ ఖాతాలో ఆ రికార్డ్

SA vs WI 2nd Test: Keshav Maharaj became only the 2nd South African bowler to take a test hat-trick

సెయింట్ లూసియా: క్రికెట్ ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసించిన వెస్టిండీస్ వీరుల ప్రతిష్ఠ మరింత మసక బారింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయింది. ఈ రెండింట్లో ఒక్క మ్యాచ్‌లోనూ ప్రతిఘటించలేకపోయారు విండీస్ క్రికెటర్లు. అయిదురోజుల పాటు నిలిచి, టెస్ట్ మ్యాచ్‌ను ఆడే ఓపిక, సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. టీ20 ఫార్మట్‌కు అలవాటు పడ్డ తరువాత క్రీజ్‌లో నిలదొక్కుకుని సుదీర్ఘమైన ఇన్నింగ్‌ను ఆడాలనే విషయాన్ని కూడా వెస్టిండీస్ క్రికెటర్లు దాదాపు మరిచిపోయినట్టే. అందుకే- దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

రెండో టెస్ట్ కూడా..

రెండో టెస్ట్ కూడా..

సెయింట్ లూసియాలోని గ్రాస్ ఐస్‌లెట్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది వెస్టిండీస్. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 324 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 165 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ కీరన్ పావెల్, టాప్ ఆర్డర్‌లో కైలె మేయర్స్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, లోయర్ ఆర్డర్‌లో కీమర్ రోచ్ ఓ మోస్తరు స్కోరు చేయగలిగారు. కీరన్ పావెల్ 51 పరుగులు చేశాడు. మేయర్స్-34, బ్లాక్‌వుడ్-25, కీమర్ రోచ్-27 పరుగులు చేయగలిగారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లెవరూ డబుల్ డిజిట్‌ను కూడా అందుకోలేకపోయారు.

కేశవ్ మహరాజ్ హ్యాట్రిక్

కేశవ్ మహరాజ్ హ్యాట్రిక్

దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహరాజ్, కగిసో రబడ ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్లు నిలవలేకపోయారు. అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్‌ను ఎదుర్కొనలేకపోయారు. కేశవ్ మహరాజ్ ఈ ఇన్నింగ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇన్నింగ్ 37వ ఓవర్‌లో కీరన్ పావెల్, జేసన్ హోల్డర్, జోషువా డసిల్వాలను వరుస బంతుల్లో పెవిలియన్ దారి పట్టించాడు. ఆ ఓవర్‌లో 3,4,5 బంతులకు వికెట్లను తీశాడు. అతని హ్యాట్రిక్‌కు తొలుత బలైంది కీరన్ పావెల్. అప్పుడే హాప్ సెంచరీని పూర్తి చేసుకున్న పావెల్.. కేశవ్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని అర్థం చేసుకోలేకపోయాడు. దాన్ని ఆడటానికి ప్రయత్నించగా.. గాల్లోకి లేచింది. నోర్ట్జె‌ చేతుల్లో వాలింది. నాలుగో బంతికి జేసన్ హోల్డర్‌ను అవుట్ చేశాడు. ఇన్‌‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని పీటర్సన్ అందుకున్నాడు. అయిదు బంతికి డసిల్వా బలి అయ్యాడు. అవుట్ సైడ్ లెగ్ ఫుల్లర్‌ను డసిల్వా షాట్ ఆడగా.. ముల్డర్ దాన్ని క్యాచ్‌గా అందుకున్న తీరు అద్భుతమే.

61 సంవత్సరాల తరువాత..

61 సంవత్సరాల తరువాత..

దక్షిణాఫ్రికా తరఫున ఓ బౌలర్ టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసుకోవడమనేది 61 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 1960లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో ఆ దేశ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ జ్యోఫ్ గ్రిఫిన్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. ఆ తరువాత అదే దేశానికి చెందిన మరో బౌలర్ అదే టెస్టుల్లో హ్యాట్రిక్ తీసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈ హ్యాట్రిక్‌తో కేశవ్ మహరాజ్ అయిదు వికెట్లను పడగొట్టినట్టయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మాత్రం కగిసో రబడ ఎగరేసుకెళ్లాడు. తొలి ఇన్నింగ్‌లో రెండు, రెండో ఇన్నింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు రబడ.

Story first published: Tuesday, June 22, 2021, 7:24 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X