న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 టీ20 ఓటములు: మూడో జట్టుగా ఆర్సీబీ ఖాతాలో ఓ చెత్త రికార్డు

IPL 2019 : Royal Challengers Bangalore Only 3rd Team To Lose 100 T20 Matches || Oneindia Telugu
Royal Challengers Bangalore only 3rd team to lose 100 T20 matches

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్‌లో ఆర్సీబీకి ఇది 100వ ఓటమి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టీ20ల్లో 100సార్లు ఓడిన మూడో జట్టుగా

దీంతో టీ20ల్లో 100సార్లు ఓడిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఇంగ్లాండ్‌కు చెందిన మిడిలెక్స్ (112 మ్యాచ్‌లు), డెర్బీషైర్(101 మ్యాచ్‌లు) జట్లు ఈ జాబితాలో మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ ఓడిన 90 మ్యాచ్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండటం విశేషం.

ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

మరోవైపు ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ఏడేళ్ల ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ మాత్రమే. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన మొదటి ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు

వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు

ఈ క్రమంలో ఐపీఎల్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిన జట్టు రికార్డుని కూడా ఆర్సీబీ సమం చేసింది. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) వరుసగా ఆరు సార్లు ఓడిపోయింది. ఈ సీజన్‌లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే దాంట్లో గెలిచి.. ఆ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలతో ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఆర్సీబీ కీలక మ్యాచ్‌లో తడబడింది.

ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ

ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ

దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 7 వికెట్లకు 171 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో పార్థివ్‌ పటేల్‌ (39), స్టాయినిస్‌ (32 నాటౌట్‌) మాత్రమే ఫరవాలేదనిపించారు.

Story first published: Monday, April 29, 2019, 15:25 [IST]
Other articles published on Apr 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X