న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలైట్ జాబితాలో రాస్ టేలర్: ప్లెమింగ్ రికార్డు బద్దలయ్యేనా?

 Ross Taylor joins former captain Stephen Fleming in elite list of New Zealand players

హైదరాబాద్: న్యూజిలాండ్‌ క్రికెటర్ రాస్‌ టేలర్‌ ఎలైట్ జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్‌లో ఏడువేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజున రాస్ టేలర్ ఈ ఘనత సాధించాడు.

ప్రస్తుతం టెస్టుల్లో రాస్‌ టేలర్‌ ఖాతాలో 7,023 పరుగులు ఉన్నాయి. దీంతో టెస్టుల్లో ఏడువేల పరుగులు సాధించిన 51వ క్రికెటర్‌‌గా రాస్ టేలర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇక, న్యూజిలాండ్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. అంతకుముందు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఏజ్ ఫ్రాడ్: ఢిల్లీ ప్లేయర్ ప్రిన్స్ రామ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐఏజ్ ఫ్రాడ్: ఢిల్లీ ప్లేయర్ ప్రిన్స్ రామ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ

రెండో క్రికెటర్‌గా రాస్ టేలర్

రెండో క్రికెటర్‌గా రాస్ టేలర్

స్టీఫెన్ ఫ్లెమింగ్‌ తన కెరీర్‌లో మొత్తం 111 మ్యాచ్‌లాడి 189 ఇన్నింగ్స్‌ల్లో 7,172 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్ తర్వాత న్యూజిలాండ్ తరుపున టెస్టుల్లో 7వేల పరుగుల క్లబ్‌లో చేరిన క్రికెటర్‌గా రాస్ టేలర్‌ గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్ తరుపున 96 టెస్టులాడిన రాస్ టేలర్ ఇప్పటివరకు 7022 పరుగులు చేశాడు.

19 సెంచరీలు

19 సెంచరీలు

ఇందులో 19 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 228 వన్డేలాడి 8,376 పరుగులు చేయగా... అంతర్జాతీయ టీ20ల్లో 95 మ్యాచ్‌లాడి 1,743 పరుగులు చేశాడు. కాగా, ఇటీవలే టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే.

126వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే

126వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే

స్మిత్‌ తన 126వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే ఏడువేల పరుగులు పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 73 ఏళ్ల రికార్డును స్టీవ్ స్మిత్‌ బద్దలు కొట్టాడు. 1946లో ఇంగ్లాండ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్ వాలీ హమ్మాండ్‌ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల్ని సాధించాడు. స్టీవ్ స్మిత్‌ 126 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయని సాధించాడు.

తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 7000 పరుగులు

తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 7000 పరుగులు

ఇటీవలే పాక్‌తో జరిగిన టెస్టు స్టీవ్ స్మిత్‌కు 70వ టెస్టు కావడం విశేషం. ఫలితంగా టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల రికార్డుని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హమ్మాండ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

ఆసీస్ తరుపున 11వ ఆటగాడిగా స్మిత్‌

ఆసీస్ తరుపున 11వ ఆటగాడిగా స్మిత్‌

సెహ్వాగ్‌ 134 ఇన్నింగ్స్‌ల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక, సచిన్‌ టెండూల్కర్‌(136) నాలుగో స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లీ, కుమార సంగక్కార, గ్యారీ సోబర్స్‌(138)లు సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున 7000 టెస్టు పరుగులు సాధించిన 11వ ఆటగాడి స్మిత్‌ నిలిచాడు.

Story first published: Tuesday, December 3, 2019, 14:47 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X