న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ వరల్డ్‌ రికార్డు.. 22 ఏళ్ల నాటి జయసూర్య రికార్డు బద్దలు!!

India vs West Indies 3rd ODI : Rohit Sharma Breaks Sanath Jayasuriya's 22 Year Old Record
Rohit Sharma surpasses Sanath Jayasuriyas record of most international runs in a calendar year as an opener

కటక్‌: టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఓపెనర్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కటక్‌లో విండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్‌ 9 పరుగుల వద్ద ఉన్నపుడు 'హిట్‌మ్యాన్‌' ఈ ఫీట్‌ సాధించాడు.

<strong>సిక్సర్లతో విరుచుకుపడ్డ పొలార్డ్.. టీమిండియా లక్ష్యం 316!!</strong>సిక్సర్లతో విరుచుకుపడ్డ పొలార్డ్.. టీమిండియా లక్ష్యం 316!!

 జయసూర్య రికార్డు బద్దలు:

జయసూర్య రికార్డు బద్దలు:

రోహిత్ మూడో వన్డేలో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. 1997లో జయసూర్య అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో 2,387 పరుగులు చేసాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 2387 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. తర్వాత ఏ ఓపెనర్‌ దాన్ని అధిగమించలేకపోయాడు.

మూడో స్థానంలో సెహ్వాగ్:

మూడో స్థానంలో సెహ్వాగ్:

22 ఏళ్ల తర్వాత జయసూర్య రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రోహిత్‌ అధిగమించకపోయి ఉంటే జయసూర్య పేరిట రికార్డు అలాగే ఉండిపోయేది. ఎందుకంటే.. ఈ ఏడాదికి టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2008లో 2,355 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2003లో ఆసీస్ ఓపెనర్ హెడెన్ 2,349 పరుగులు చేసాడు.

కోహ్లీ@1:

కోహ్లీ@1:

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 2,370 పరుగులతో ఉన్నాడు. 2016 నుంచి వరుసగా మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పరంగా టాప్‌తోనే ముగించాడు. 2016లో 2,595 పరుగులు సాధించగా.. 2017లో 2,818 పరుగులు.. 2018లో 2,735 పరుగులు చేసాడు. దీంతో కోహ్లీ 'హ్యాట్రిక్‌'ను సాధించాడు. అంతేకాదు వరుసగా మూడు సంవత్సరాల పాటు టాప్‌లో నిలిచిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

కోహ్లీ ఒంటరి పోరాటం:

కోహ్లీ ఒంటరి పోరాటం:

విండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ (77) కూడా అర్థ శతకం సాధించాడు.ఈ జోడి మొదటి వికెట్‌కు122 పరుగులు జోడించారు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా.. శ్రేయాస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7) తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కేదార్ జాదవ్ (8) కోహ్లీతో పాటు క్రీజులో ఉన్నాడు. భారత్‌ 38 ఓవర్లలలో నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 95 పరుగులు కావాలి.

Story first published: Sunday, December 22, 2019, 21:02 [IST]
Other articles published on Dec 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X