న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ ఇక టెస్ట్ మ్యాచ్‌ల్లో ఉండడు

Rohit Sharma may not play Test cricket ever again if he fails once more, says South Africa legend

హైదరాబాద్: 'అతను తప్పులు సరిదిద్దుకోకపోతే ఇక మీదట టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సిందే'నంటూ రోహిత్ శర్మను హెచ్చరిస్తున్నాడు దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ జాంటీరోడ్స్. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన మూడు ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ 31 పరుగులే చేయడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. తొలి టెస్టులో 11, 10 పరుగులు చేసిన హిట్ మ్యాన్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ పది పరుగులకే వెనుదిరిగాడు. దీంతో తొలి డిజిటల్ క్రికెటర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

దక్షిణాఫ్రికా తరపున 245 వన్డేలు, 52టెస్ట్‌లు ఆడిన జాంటీ రోడ్స్‌ ట్రిపుల్ సెంచరీ యోధుడైన రోహిత్ శర్మను తీవ్రంగా విమర్శిస్తున్నాడు. 'చూస్తూ ఉంటే రోహిత్‌కు ఏదో బలహీనత పట్టినట్టుంది. ఆఫ్ స్టంప్‌కు అవతల వేస్తున్న బంతులను సైతం అందిపుచ్చుకుని క్యాచ్‌లు ఇచ్చి మరీ అవుట్ అవుతున్నాడు. ఇది ముమ్మాటికీ తప్పే' అని రోహిత్‌ను విమర్శలతో ముంచెత్తుతున్నాడు జాంటీ రోడ్స్.

ఇంకా మాట్లాడుతూ, 'దక్షిణాఫ్రికా జట్టు రోహిత్ రావడంతోనే ప్రణాళికతో సిద్ధమైపోతున్నారు. ఆ విషయాన్ని రోహిత్ పసిగట్టలేక చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడు. ఇదే విధంగా ఆడుతూ పోతే ఇక మరో టెస్ట్ మ్యాచ్‌లకు రోహిత్‌ను తీసుకునే అవకాశమే లేదు' అని జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉంటే, భారత్ తరపు మరో స్టార్ బ్యాట్స్ మెన్ అయినటువంటి అజింకా రహానే మాట్లాడుతూ,'రోహిత్ శర్మ ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తే భారం మొత్తం విరాట్‌పై పడుతుంది.' అని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం వీరికి వంత పాడుతున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న రోహిత్ శర్మ తన తీరును మార్చుకోకపోవడం వల్లే అందరూ అతనికి బదులుగా అజింకా రహానెను తీసుకోవాలి అంటూ సూచిస్తున్నారు'. అని పేర్కొన్నాడు.

2013లోనూ దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆడిన రోహిత్ అప్పుడు కూడా దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 14, 6, 0, 25 రన్స్ చేశాడు. సఫారీ గడ్డ మీద ఇప్పటి వరకూ రోహిత్ 10.85 యావరేజ్‌తో 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Story first published: Tuesday, January 16, 2018, 11:59 [IST]
Other articles published on Jan 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X