న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలైట్ జాబితాలోకి రోహిత్ శర్మ: చెన్నై టీ20లో మరో రికార్డు

Rohit Sharma joins Virat Kohli in elite list after series win against Windies

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం చెన్నై వేదికగా పర్యాటక వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో రెండొందల ఫోర్లు బాదిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ అరుదైన గుర్తింపు సాధించాడు.

Virender Sehwag Asks Why Did Drop Rohit Sharma From Test Team Earlier? | Oneindia Telugu

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో రోహిత్‌ శర్మ రెండొందల ఫోర్ల క్లబ్‌లో చేరాడు. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఫోర్‌ బాది పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ నిలిచాడు.

రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ

రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ

ఈ జాబితాలో రోహిత్ శర్మ కంటే ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 214 ఫోర్లతో ఉండగా, రోహిత్‌ శర్మ పేరిట 200 ఫోర్లు ఉన్నాయి. కాగా, మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్‌ తిలకరత్నే దిల్షాన్‌(223) ముందు వరుసలో ఉన్నాడు.

గుప్టిల్‌తో కలిసి నాలుగో స్థానంలో రోహిత్ శర్మ

గుప్టిల్‌తో కలిసి నాలుగో స్థానంలో రోహిత్ శర్మ

ఆ తర్వాత స్థానంలో అప్ఘన్ ఆటగాడు మొహ్మద్‌ షెహజాద్‌(218) నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, మార్టిన్‌ గుప్తిల్‌, రోహిత్‌ శర్మలు ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్‌, రోహిత్‌ శర్మలు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. ఆఖరి టీ20లో భారత్‌ ఆఖరి బంతికి గెలిచిన సంగతి తెలిసిందే.

సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

విండీస్‌ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 3-0 తేడాతో సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

టీ20ల్లో 200కుపైగా ఫోర్లు బాదిన ఆటగాళ్లు వీరే

టీ20ల్లో 200కుపైగా ఫోర్లు బాదిన ఆటగాళ్లు వీరే

223 తిలకరత్నే దిల్షాన్

218 మొహ్మద్ షెహజాద్

214 విరాట్ కోహ్లీ

200 మార్టిన్ గుప్టిల్/రోహిత్ శర్మ

199 బ్రెండన్ మెక్‌కల్లమ్

Story first published: Monday, November 12, 2018, 11:55 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X