న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 సిరిస్ ఓటమి నిరాశను కలిగించింది: రోహిత్ శర్మ

India Vs New Zealand : Rohit Sharma Says Disappointing To Not Cross The Line | Oneindia Telugu
Rohit Sharma concedes Team India would be disappointed to have lost T20I series against New Zealand

హైదరాబాద్: టీ20 సిరిస్ ఓటమి నిరాశను కలిగించిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. హామిల్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆఖరి బంతి వరకూ పోరాడినా 208/6కే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు.

ధోని కోసం బారికేడ్లు దూకి మైదానంలోకి: త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడు (వీడియో)ధోని కోసం బారికేడ్లు దూకి మైదానంలోకి: త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడు (వీడియో)

రోహిత్ శర్మ మాట్లాడుతూ

రోహిత్ శర్మ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "టీ20 సిరీస్‌ ఓటమి నిరాశ కలిగించింది. 213 పరుగుల లక్ష్యం చాలా కష్టమే. కానీ.. ఆఖరి ఓవర్ వరకూ భారత్ జట్టు గెలుపు అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంటూ వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లు ఒత్తిడిని చక్కగా అధిగమించి.. చివర్లో వరుసగా యార్కర్లు వేయగలిగారు. కివీస్ పర్యటనని వన్డే సిరీస్‌ విజయంతో భారత్ జట్టు మెరుగ్గానే ఆరంభించింది" అని అన్నాడు.

యువ క్రికెటర్లు కూడా

యువ క్రికెటర్లు కూడా

"టీమ్‌లోని యువ క్రికెటర్లు కూడా అన్ని మ్యాచ్‌ల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. కానీ.. సుదీర్ఘ పర్యటనని గెలుపుతో ముగించలేకపోయాం. ఇది కొంచెం నిరాశ కలిగించింది. ఓడినా ఈ పర్యటనలో మాకు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. పర్యటన ఆసాంతం మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. బాగా శ్రమించారు" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం

తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం

"అయితే.. ఈ తప్పిదాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం. విజయంతో ముగించలేకపోయినందుకు వాళ్లకు నిరాశ కలుగుతుండొచ్చు. కానీ మేం తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగాం. ఆస్ట్రేలియాపై సిరీస్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. వన్డే సిరీస్‌ను గెలుచుకున్నామన్న సంతృప్తితో తిరిగి వెళుతున్నాం" అని రోహిత్ శర్మ అన్నాడు.

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సిరిస్

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సిరిస్

కాగా, ఈ సిరీస్‌ కంటే ముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ జట్టే గెలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. భారత్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఆడనుంది.

Story first published: Monday, February 11, 2019, 10:51 [IST]
Other articles published on Feb 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X