న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: మరో 90 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు అందుకోనున్న రోహిత్ శర్మ!!

Rohit Sharma 90 runs away from joining Virat Kohli, Suresh Raina elite list

దుబాయ్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరుకు అబుదాబి సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది ముంబై.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా తొలి మ్యాచ్‌లోనే గెలిచి లీగ్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది .బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు‌కి కొద్ది దూరంలో నిలిచాడు.

మరో 90 పరుగులు చేస్తే:

మరో 90 పరుగులు చేస్తే:

ఈ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 90 పరుగులు చేస్తే.. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మాత్రమే 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈరోజు కనుక రోహిత్ సెంచరీ బాదితే.. కోహ్లీ, రైనా తర్వాత 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.

కోహ్లీ@1

కోహ్లీ@1

ఐపీఎల్‌లో 178 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 131.5 స్ట్రైక్‌రేట్‌తో 5,426 పరుగులు చేశాడు. సురేశ్ రైనా 193 మ్యాచ్‌‌ల్లో 137.1 స్ట్రైక్‌రేట్‌తో 5,368 పరుగులు బాదాడు. రోహిత్ శర్మ 189 మ్యాచ్‌ల్లో130.8 స్ట్రైక్‌రేట్‌తో 4,910 పరుగులతో ఉన్నాడు. చెన్నైతో గత శనివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ రోహిత్ కంటే 400లకు పైగా పరుగులు ఆధిక్యంలో ఉన్నాడు. ఈ సీజన్లో కూడా ఆడుతున్నాడు కాబట్టి.. అతన్ని అధిగమించే అవకాశం లేదు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తానికీ రైనా దూరమయ్యాడు. రోహిత్ టాప్ క్లాస్ ప్రదర్శన చేస్తే.. రైనా పరుగులను దాటే అవకాశం ఉంది.

మరోసారి టైటిల్‌ విన్నర్‌గా:

మరోసారి టైటిల్‌ విన్నర్‌గా:

రోహిత్‌ శర్మ ఇప్పటికే ముంబై జట్టును నాలుగుసార్లు (2013, 2015, 2017, 2019) విజేతగా నిలిపాడు. ఇప్పుడు యూఏఈలోనూ మరోసారి టైటిల్‌ విన్నర్‌గా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. గత ఏడాది టోర్నమెంట్‌లో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 28.93 సగటుతో 405 పరుగులు చేసాడు.

ముంబై తుది జట్టు:

ముంబై తుది జట్టు:

రోహిత్ ‌శర్మ (కెప్టెన్‌), క్వింటన్ డికాక్‌ (కీపర్‌), సౌరభ్‌ తివారి, సూర్యకుమార్‌ యాదవ్‌/ఇషాన్ కిషన్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, పాటిన్సన్‌/కౌల్టర్‌నీల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్‌ చాహర్‌.

RR vs CSK: టెక్నాలజీని సరైన విధంగా వాడాలి.. అంపైర్‌పై సాక్షి ధోనీ ఫైర్!!

Story first published: Wednesday, September 23, 2020, 17:59 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X