న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్మృతి మంధానా బ్యాటింగ్‌ కాపీ చేశా.. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది'

Riyan Parag syas Tried to copy Smriti Mandhana, didnt work out well

న్యూఢిల్లీ: రియాన్‌ పరాగ్ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. అస్సాంకు చెందిన రియాన్‌ పరాగ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ఒక్కసారిగా హీరో అయ్యాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసి రాజస్తాన్‌ రాయల్స్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో మనోడి పేరు ప్రపంచానికి తెలిసింది. పరాగ్ గత సీజన్‌లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం​ చేసాడు.

<strong>ఐపీఎల్‌లో సన్​సన్‌రైజర్స్‌దే బెస్ట్ డెత్ బౌలింగ్​: వార్నర్​</strong>ఐపీఎల్‌లో సన్​సన్‌రైజర్స్‌దే బెస్ట్ డెత్ బౌలింగ్​: వార్నర్​

ఐపీఎల్‌లో ఆడడం అదృష్టం

ఐపీఎల్‌లో ఆడడం అదృష్టం

దూకుడుగా ఆడే రియాన్‌ పరాగ్‌ ఐపీఎల్‌-12లో 7 మ్యాచ్‌లు ఆడి 130 స్టైక్‌రేట్‌తో 160 పరుగులు చేశాడు. ప్రధానంగా ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడే పరాగ్‌.. ఐపీఎల్‌లో ఆడటమే ఒక పెద్ద అదృష్టమని అంటున్నాడు. తనకు చాలా మంది క్రీడాకారులు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. తాజాగా రియాన్‌ పరాగ్ స్పోర్ట్స్ కీదాతో మాట్లాడుతూ... 'ఎప్పుడైతే రాజస్తాన్‌ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నానో అప్పుడే నా కల నిజమైందనుకున్నా. ఐపీఎల్‌ క్రికెట్‌ లీగ్‌లలో అతిపెద్దది. అందులోనూ ఆరంభపు టైటిల్‌ సాధించిన రాజస్తాన్​ జట్టులోకి రావడం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది' అని తెలిపాడు.

ధోనీ నా వెనకాలే

ధోనీ నా వెనకాలే

'నేను తొలిసారి బ్యాట్‌ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చినప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ నా వెనకాలే ఉన్నాడు. సీఎస్‌కేతో నా అరంగేట్రం మ్యాచ్‌ కావడంతో ధోనీని కీపర్‌గా దగ్గరగా చూశాను. చాలా సంతోషమేసింది. ధోనీ, విరాట్ కోహ్లీ, జోస్‌ బట్లర్‌, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రోహిత్ శర్మ ఇలా పెద్ద పెద్ద వారితో ఆడటం చాలా హ్యాపీ అనిపించింది' అని పరాగ్‌ పేర్కొన్నాడు. భయంలేకుండా క్రికెట్‌ ఆడమని‌ స్టోక్స్‌, స్మిత్‌ చెప్పారన్నాడు. తన సహజసిద్ధమైన ఆట ఆడమని సలహా ఇవ్వడంతో తాను ఫ్రీగా క్రికెట్‌ ఆడానన్నాడు.

మంధానా బ్యాటింగ్‌ కాపీ చేశా

మంధానా బ్యాటింగ్‌ కాపీ చేశా

బ్యాటింగ్‌లో చాలా మందిని కాపీ చేశానని పరాగ్‌ చెప్పుకొచ్చాడు. భారత మహిళా టాప్‌ క్రికెటర్ల దగ్గర్నుంచీ, పురుష టాప్‌ క్రికెటర్ల వరకూ చాలా మంది బ్యాటింగ్‌ను అనుకరించే యత్నం చేశానన్నాడు. 'భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానా ఆటను కాపీ చేశా. కాగా అది వర్కౌట్‌ కాలేదు' అని తెలిపాడు. పురుష క్రికెటర్లలో రోహిత్‌ శర్మను కూడా అనుకరించే యత్నం చేసినా.. సరైన ఫలితం రాలేదన్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడినప్పుడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆటను కాపీ చేస్తే కాస్త లాభించిందన్నాడు.

స్మిత్ బంతిని వదిలేసే తీరు నచ్చుతుంది

స్మిత్ బంతిని వదిలేసే తీరు నచ్చుతుంది

తన బ్యాటింగ్‌ మెరుగుపడటానికి.. భిన్నమైన షాట్లు ఆడటానికి‌ స్మితే కారణం అని అన్నాడు పరాగ్‌. 'స్మిత్‌తో పాటు‌ బట్లర్‌ ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చారు. స్టీవ్‌ బంతిని వదిలేసే తీరు బాగా నచ్చుతుంది. సాధారణంగా బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌ను ఎత్తి వదిలేస్తారు. కానీ.. కాళ్లు, శరీరాన్ని ఒకేసారి కదిలిస్తూ వికెట్లు మొత్తం కవర్‌ చేస్తూ బంతిని వదిలేస్తాడు. ఇలా చేయడం కష్టం. అతనెలా ఆడతాడో నాకూ చెప్పాడు. గత రంజీ సీజన్లో స్టీవ్‌ చిట్కాలను నేనూ ఆచరణలో పెట్టా' అని పరాగ్‌ తెలిపాడు.

Story first published: Friday, April 24, 2020, 17:25 [IST]
Other articles published on Apr 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X