న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : పంత్ లేకపోవడం పెద్ద దెబ్బే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ మిస్ అవడం ఖాయం!

Rishabh Pant not playing IPL2023 is a big blow to Delhi Capitals

టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. అతను కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో కూడా అతను ఆడే పరిస్థితి లేదని, ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమే తనకు చెప్పిందని ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ ఇటీవలే వెల్లడించాడు. దీంతో పంత్ లేని లోటు ఆ జట్టులో కచ్చితంగా జట్టుకు తెలుస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి కారణాలు ఏంటంటే?

మంచి నాయకుడు

మంచి నాయకుడు

ఢిల్లీ జట్టును రిషభ్ పంత్ చక్కగా ముందుకు నడిపించాడు. అంతకుముందు ఆ జట్టు సారధిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ గాయంతో దూరం అవడంతో.. అతని స్థానంలో పగ్గాలు అందుకున్న పంత్ తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అయ్యర్ తిరిగొచ్చినా కెప్టెన్సీని మాత్రం పంత్ చేతిలోనే ఉంచిందా జట్టు యాజమాన్యం.

ఈ క్రమంలోనే 2021లో జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు పంత్. గతేడాది ప్లేఆఫ్స్ చేరడంలో జట్టు విఫలమైనా.. చాలా మంది ఆటగాళ్లు పంత్‌ను మంచి నాయకుడిగా చెప్పుకున్నారు. టీమిండియాలో ఇటీవల పునరాగమనం చేసిన కుల్దీప్ యాదవ్ కూడా పంత్‌లో ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయని పొగిడాడు.

హార్డ్ హిట్టింగ్ బ్యాటర్

హార్డ్ హిట్టింగ్ బ్యాటర్

ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేక పంత్ అవస్థలు పడుతున్నప్పటికీ.. అతను మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. అతను క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థుల్లో టెన్షన్ పెంచగలడు. దీనికితోడు జట్టులో ఎలాంటి పొజిషన్‌లో అయినా ఆడగల సమర్ధుడు. అండర్-19 రోజుల్లోలా ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించగలడు.

అలాగే ఫినిషర్‌గా భారీ షాట్లు ఆడగలడు. దానికితోడు మిడిలార్డర్‌లో నెమ్మదిగా ఆడుతూ జట్టు బ్యాలెన్స్ కాపాడగలడు. ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా అతను చాలా మంచి బ్యాటర్. ఐపీఎల్‌లో 150పైగా స్ట్రైక్‌రేటుతో ఆడే పంత్.. ఈ లీగ్‌లో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేసిన సంగతి మరువకూడదు.

కీపింగ్‌లో నెంబర్ వన్

కీపింగ్‌లో నెంబర్ వన్

బౌలర్లను అర్థం చేసుకునే వికెట్ కీపర్ దొరకడం చాలా కష్టం. పంత్ సరిగ్గా అలాంటి వాడే. ముఖ్యంగా స్పిన్నర్ల సక్సెస్‌లో కీపర్ల పాత్ర కూడా చాలా ఉంటుంది. ధోనీ ఇలాగే చాహల్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ కెరీర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. పంత్ కూడా ఈ లక్షణాన్ని ధోనీ నుంచి పుణికిపుచ్చుకున్నాడు. ఎవరైనా బౌలర్ నెర్వస్‌గా ఫీలవుతుంటే చటుక్కున అతని దగ్గరకు వెళ్లి భుజంపై చెయ్యేసి మాట్లాడతాడు. ఎలాంటి బంతులు వేస్తే బ్యాటర్‌ను బోల్తా కొట్టించాలో సలహాలు ఇస్తాడు. ఇలాంటి కీపర్ మరొకరు దొరకడం ఢిల్లీకి కష్టమనే చెప్పాలి.

Story first published: Friday, January 13, 2023, 16:54 [IST]
Other articles published on Jan 13, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X