న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భిన్నంగా చూడాలి: రిషబ్ పంత్ ఈ తరం వీరేంద్ర సెహ్వాగ్

IPL 2019 : Rishabh Pant Is Virender Sehwag Of This Generation,Says Sanjay Manjrekar
Rishabh Pant is Virender Sehwag of this generation, says Sanjay Manjrekar

హైదరాబాద్: యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌పై కామెంటేటర్, మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రిషబ్ పంత్‌ను మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. తనదైన రోజున రిషబ్ పంత్ ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కులు చూపిస్తాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బుధవారం విశాఖ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్సే అందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో పంత్ 21 బంతుల్లో 49 పరుగులు చేసిన ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పంత్ లాంటి ఆటగాడిని భిన్నంగా చూడాలని, అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వాలని తెలిపాడు.

ఈ మేరకు తన ట్విట్టర్‌లో రిషబ్ పంత్ "పంత్‌ను ఈ తరానికి చెందిన వీరేంద్ర సెహ్వాగ్‌. భిన్నంగా చూడాల్సిన బ్యాట్స్‌మన్‌లో పంత్ ఒకడు. పంత్‌ను జట్టులోకి తీసుకున్నా, తీసుకోకపోయినా అతడి ఆటతీరు మాత్రం మారదు" అని సంజయ్‌ మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు. సన్‌రైజర్స్‌‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఫంత్ ఆడిన ఇన్నింగ్స్‌తోనే సన్‌రైజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టోర్నీలో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో పంత్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ సీజన్‌లో రిషబ్‌ పంత్‌ ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడి 37.50 యావరేజితో 450 పరుగులు చేశాడు.

కాగా, ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెలక్టర్లపై విమర్శలు రావడంతో అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లను స్టాండ్ బై ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఫామ్‌ని చూస్తుంటే వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

Story first published: Friday, May 10, 2019, 15:10 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X