న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది జట్టు మేనేజ్‌మెంట్‌దే నిర్ణయం: పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్

ICC Cricket World Cup 2019 : Rishabh Pant Made A Big Statement With His Batting : Sachin || Oneindia
 Rishabh Pant has always been aggressive : Sachin Tendulkar

హైదరాబాద్: యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని సచిన్ అన్నాడు. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రీజులో ఉన్నంత సేపు పంత్ పరుగుల వరద పారించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో పంత్ 29 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ 110.34గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌కి పంత్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. జట్టు స్కోరు 226 పరుగుల వద్ద లియాం ప్లంకెట్ వేసిన 39వ ఓవర్ ఆఖరి బంతిని పంత్ హుక్ షాట్ ఆడ‌ాడు.

అద్భుత క్యాచ్‌కి పెవిలియన్‌కు చేరిన పంత్

ఆ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న క్రిస్ వోక్స్ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో పంత్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ అనంతరం పంత్ ఇన్నింగ్స్‌పై సచిన్ మాట్లాడుతూ "ప్రపంచకప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో పంత్‌ తన ప్రదర్శనతో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు" అని అన్నాడు.

షాట్ల ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవు

షాట్ల ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవు

"తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి నోళ్లు మూయించాడు. అతడి షాట్ల ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవు. హార్దిక్‌ పాండ్యా​, రిషభ్‌ పంత్‌ విధ్వంసకర ఆటగాళ్లు. ప్రత్యర్థి జట్ల నుంచి మ్యాచ్‌ను అమాంతం లాగేసుకునే సత్తా వారికి ఉంది. పంత్‌‌ను నేను డైనమెట్‌ అని పిలుస్తుంటాను" అని సచిన్ అన్నాడు.

అది జట్టు మేనేజ్‌మెంట్‌దే నిర్ణయం

అది జట్టు మేనేజ్‌మెంట్‌దే నిర్ణయం

"ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో అతడి ఆట చూశాకా అలా పిలవడం సరైందే అని అనిపించింది. పంత్‌ను తదుపరి మ్యాచ్‌ల్లో కొనసాగించేది లేనిది జట్టు మేనేజ్‌మెంట్‌దే నిర్ణయం. ఇక, మ్యాచ్‌ గురించి మాట్లాడితే కోహ్లీ, రోహిత్‌లు బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపు మ్యాచ్‌ మనచేతుల్లోనే ఉంది. వీరిద్దరూ ఔటైన అనంతరం మ్యాచ్‌ మన చేతుల్లో నుంచి చేజారింది" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 1, 2019, 18:56 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X