న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ టెస్టులో 21 మెయిడిన్ ఓవర్లు: బాపు నాదకర్ణి మృతిపై సన్నీ, సచిన్ సంతాపం

RIP Bapu Nadkarni: Sunil Gavaskar remembers helpful manager, Sachin Tendulkar offers condolence

హైదరాబాద్: భారత మాజీ ఆల్ రౌండర్ బాపు నాదకర్ణి మృతి పట్ల మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు సోషల్ మీడియా వేదికగా తమ సంతపాన్ని వ్యక్తం చేశారు. 86 ఏళ్ల బాపు నాదకర్ణి శుక్రవారం కన్నుమూసిన సంగత తెలిసిందే. ఆయన పూర్తి పేరు రమేశ్‌ చంద్ర గంగారం బాపు నాదకర్ణి.

ఆల్ రౌండర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు నాదకర్ణి 1955-1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన 88 వికెట్లు పడగొట్టడంతో పాటు 1414 పరుగులు చేశారు. ఆ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జాతీయ సెలక్టర్‌గా కూడా కొంత కాలం సేవలందించారు.

హద్దు మీరి ప్రవర్తించిన రబాడ: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు దూరమే!హద్దు మీరి ప్రవర్తించిన రబాడ: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు దూరమే!

ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 1964లో మద్రాసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 32 ఓవర్లలో 27 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో వరుసగా 21 మెయిడిన్‌ ఓవర్లు ఉండటం ఒక అరుదైన రికార్డు సృష్టించింది.

ఆయన మరణం భారత క్రికెట్‌కు తీరని లోటని బీసీసీఐ తన సంతాపాన్ని తెలిపింది. మరోవైపు సచిన్ టెండూల్కర్ సైతం తన ట్విట్టర్‌లో "శ్రీ బాపు నాదకర్ణి మరణం గురించి విన్నప్పుడు చాలా బాధగా ఉంది. ఒక టెస్టులో ఆయన 21 మెయిడిన్ ఓవర్లు వేశారని విన్నాను. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా సంతాపం" అని ట్వీట్ చేశాడు.

సానియా సంచలనం.. హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ కైవసంసానియా సంచలనం.. హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ కైవసం

ఇక, బాపు నాదకర్ణ మరణంపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "ఆయన మా పర్యటనల కోసం అసిస్టెంట్ మేనేజర్‌గా వచ్చారు. ఆయన చాలా ప్రోత్సహించేవారు. అతనికి ఇష్టమైన పదం "చోడో మాట్" [అక్కడ వేలాడదీయండి]. ఆ రోజుల్లో గ్లవ్స్‌, ప్యాడ్స్‌ అంత దృఢంగా ఉండేవి కావు. బంతి తగిలితే గాయాలే. అయినా వాటిని ఆయన అసలు పట్టించుకోడు. వాటిని 'వదిలెయ్‌' అని చెప్పేవాడు." అని వెల్లడించారు.

Story first published: Saturday, January 18, 2020, 15:21 [IST]
Other articles published on Jan 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X