న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న ఆస్ట్రేలియా.. సాకులు చెప్పి తప్పించుకోవడం కుదరదన్న మాజీ లెజెండ్!

Ricky Ponting says no excuses if australia fails to reach semifinals

టీ20 ప్రపంచకప్ మొదలైనప్పుడు సెమీస్ చేరే జట్లు ఏవి? అని దాదాపుగా అందరూ అంచనాలు వేశారు. దాదాపుగా వీళ్లందరూ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కచ్చితంగా సెమీస్ చేరుతుందని భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కూడా చేరకుండానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఆ జట్టు అభిమానులు, మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రూప్-1లో మొదటగా సెమీస్ చేరేది ఆ జట్టే?

గ్రూప్-1లో మొదటగా సెమీస్ చేరేది ఆ జట్టే?

ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా అందరూ భావించిన ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే దాదాపు నిష్క్రమించే పరిస్థితిలో ఉంది. సెమీస్ రేసులో ఆ జట్టు ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అప్పటికీ కచ్చితంగా ఆసీస్ జట్టు సెమీస్ చేరుతుందని చెప్పలేం. ఎందుకంటే గ్రూప్-1 నుంచి న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ కూడా సెమీస్ రేసులో ఉన్నాయి. శుక్రవారం నాడు ఐర్లాండ్‌పై న్యూజిల్యాండ్ గెలిస్తే.. ఆ జట్టు అందరి కన్నా ముందే సెమీస్ చేరుకుంటుంది.

సెమీస్ చేరడం చాలా కష్టం..

సెమీస్ చేరడం చాలా కష్టం..

గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన న్యూజిల్యాండ్.. ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అదే సమయంలో గ్రూప్-1లో ఇంగ్లండ్ కూడా సెమీస్ రేసులో ముందంజలోనే ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ విషయంలో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో ఉంది. శనివారం నాడు ఇంగ్లండ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. ఏదైనా సంచలనం జరిగి ఇంగ్లండ్ ఓడితే.. ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది. లేదంటే నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సిందే.

ఆ మూడు జట్లు ఫేవరెట్లు అనుకున్నా..

ఆ మూడు జట్లు ఫేవరెట్లు అనుకున్నా..

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉన్న స్థితిపై ఆ జట్టు మాజీ సారధి, లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా జట్టు కీలకమైన సమయంలో తమ ఆటతీరును మెరుగు పరుచుకోవడంలో విఫలమైందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా ఆసీస్ జట్టు సెమీస్ చేరకపోతే అంతకన్నా వైఫల్యం మరొకటి ఉండదని, తను కూడా ఆసీస్ కచ్చితంగా సెమీస్ చేరుతుందనే అనుకున్నానని అన్నాడు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో రెండు ఫైనల్ చేరతాయని తాను అంచనా వేశానన్న పాంటింగ్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో అంత సత్తా కనిపించడం లేదన్నాడు.

పాంటింగ్ ఏమన్నాడంటే..

పాంటింగ్ ఏమన్నాడంటే..

'ఈ ఆటగాళ్లంతా చిన్నతనం నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు. ఈ మైదానాల్లో ఎన్నో మ్యాచులు ఆడారు. కచ్చితంగా ఈ టోర్నమెంట్‌లో రాణిస్తారని అనుకున్నా. యూఏఈలో అలవాటు లేని పరిస్థితుల్లో కప్ కొడతామని ఎవరూ ఊహించలేదు. అలాంటిది తెలిసిన వాతావరణంలో కచ్చితంగా గెలుస్తామని అనుకున్నా. టోర్నీలో అన్నీ ఆసీస్‌కు కలిసొచ్చే అంశాలే ఉన్నాయని అనుకున్నా. కానీ ఈ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. సెమీస్ చేరకపోతే ఈ జట్టు గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రపంచకప్‌‌ ఆరంభంలో ఈ జట్టు ఫామ్ అంత బాగలేదు. ఆ తర్వాత కూడా ఆటగాళ్ల తీరు మారలేదు. ఇక ఓడిపోతే కుంటి సాకులు చెప్పడానికి లేదు' అని పాంటింగ్ తెలిపాడు.

Story first published: Friday, November 4, 2022, 10:59 [IST]
Other articles published on Nov 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X