న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్‌లను తక్కువ అంచనా వేయకూడదు.. కోహ్లీపై నమ్మకానికి కారణం అదే: పాంటింగ్

Ricky ponting reveals the reason he backed virat kohli to shine again

ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నాలుగు మ్యాచులు ఆడింది. వీటిలో మూడింట్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టి, మూడు సార్లూ అజేయంగా నిలిచిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను అతనే ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా రాణించాడు. సౌతాఫ్రికా మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ అవుటైనా.. మళ్లీ బంగ్లాదేశ్‌పై బ్యాటు ఝుళిపించాడు. మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.

ఏడాది ఆరంభంలో..

ఏడాది ఆరంభంలో..

మూడేళ్లుగా కోహ్లీ సరైన ఫామ్‌లో లేడు. అంటే ఆడటం లేదని కాదు. కోహ్లీలా ఆడలేదు. గతంలో మంచినీళ్లు తాగినట్లు సెంచరీలు చేసే.. మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేదు. అతని కెప్టెన్సీలో జట్టు అద్భుతంగా ఆడినా ఒక్క ఐసీసీ టోర్నమెంట్‌నూ గెలవలేకపోయింది. దీనికితోడు ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ ఫామ్ మరింత దిగజారింది. ముఖ్యంగా టీ20ల్లో తన ఆటతీరుకు విరుద్ధంగా ఉన్న టీమిండియా కొత్త టెంప్లేట్‌ను ఫాలో అవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో మంచి స్కోర్లు చెయ్యలేకపోయాడు.

జట్టులోంచి తీసేయాలని డిమాండ్లు

జట్టులోంచి తీసేయాలని డిమాండ్లు

కోహ్లీ ఆటతీరు సరిగా లేదని, ఫామ్‌లో లేని అతన్ని టీ20 ప్రపంచకప్‌లో ఆడించకూడదని పలువురు డిమాండ్ చేశారు. మాజీ లెజెండ్ కపిల్ దేవ్ కూడా ఆడలేకపోతున్నప్పుడు కోహ్లీని పక్కనపెట్టడంలో తప్పేంటని అడిగాడు. దీంతో పెద్ద దుమారమే రేగింది. స్వదేశంలో మాజీలు అతని సత్తాను ప్రశ్నిస్తుంటే.. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ మళ్లీ కచ్చితంగా ఫామ్ అందుకుంటాడని నమ్మకం కనబరిచాడు. చివకు అదే నిజమైంది. ఆసియా కప్‌ నుంచి కోహ్లీ మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్నాడు.

ఛాంపియన్‌లను తక్కువ అంచనా వెయ్యకూడదు..

ఛాంపియన్‌లను తక్కువ అంచనా వెయ్యకూడదు..

కోహ్లీపై ఇంత నమ్మకం ఎందుకు ఉంచాడో పాంటింగ్ వెల్లడించాడు. 'చాలా ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో కోహ్లీ ఒక ఛాంపియన్ ప్లేయర్‌గా ఉన్నాడు. నా అనుభవంలో ఛాంపియన్ల గురించి నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే.. ముఖ్యంగా ఈ ఆటలో వాళ్లను ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. ఏదో ఒక మార్గం వెతుక్కొని వాళ్లు మళ్లీ లేచి నిలబడతారు.

ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లే అద్భుతంగా పోరాడతారు. మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్ మ్యాచ్‌లో నేను ఏం జరుగుతుందని అనుకున్నానో అదే జరిగింది. విరాట్ మళ్లీ తన పాత పద్ధతిలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. నేను ఈ క్రీడలో చూసిన అద్భుతమైన క్షణాల్లో అదే బెస్ట్' అని వివరించాడు.

Story first published: Saturday, November 5, 2022, 15:35 [IST]
Other articles published on Nov 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X