న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్‌లో ఎప్పుడూ ఒక్క మంచి ప్రదర్శన చేయలేదు.. అతనికి రీఎంట్రీ కష్టమే: పాంటింగ్‌

Ricky Ponting on Usman Khawaja, He’s good but never saw his best in internationals

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్లకి 2020-21 సీజన్‌కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. గ‌తేడాది ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా సీఏ వార్షిక కాంట్రాక్ట్‌ల‌ను విడుద‌ల చేయగా.. ‌ఉస్మాన్‌ ఖవాజాకు షాక్ ఇచ్చింది. గ‌తేడాది యాషెస్ సిరీస్ మూడో టెస్టు నుంచి ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఖ‌వాజా దూరమయ్యాడు. దీంతోనే అతనికి కాంట్రాక్ట్ దక్కలేదు. ఇక కెరీర్‌పై డైలమాలో పడ్డ ఖవాజాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

<strong>కోహ్లీతో బాబర్‌ను పోల్చడం తొందరపాటే.. ఒకవేళ పోల్చుకోవాలంటే.. :యూనిస్ ఖాన</strong>కోహ్లీతో బాబర్‌ను పోల్చడం తొందరపాటే.. ఒకవేళ పోల్చుకోవాలంటే.. :యూనిస్ ఖాన

రీఎంట్రీ కష్టమే

రీఎంట్రీ కష్టమే

రికీ పాంటింగ్‌ తాజాగా ఏబీసీ గ్రాండ్‌స్టాండ్‌తో మాట్లాడుతూ... అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పుడూ ఉస్మాన్‌ ఖవాజా నుంచి ఒక మంచి ప్రదర్శన చూడలేదన్నాడు. ఖవాజాలో నిలకడైన ప్రదర్శన లేకపోవడమే అతనిపై వేటుకు కారణమన్నాడు. 'ఖవాజాకు ఆసీస్‌ జట్టులో చోటు కష్టమే. నేను ఎప్పుడూ అతనొక మంచి ప్లేయర్‌ అని ఫీలవుతూ ఉండేవాడిని. కానీ నేను ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. ఏదో కొన్ని మెరుపులు తప్పితే.. నిలకడ మాత్రం ఖవాజాలో ఎక్కడా కనిపించలేదు' అని పాంటింగ్‌ అన్నాడు.

అప్పుడైనా నిరాశపరచడనే అనుకుంటున్నా

అప్పుడైనా నిరాశపరచడనే అనుకుంటున్నా

'ఉస్మాన్‌ ఖవాజాకు నిలకడ ఉంటే ఆసీస్‌ జట్టులో కొనసాగేవాడు. అది లేకపోవడం వలనే జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఖవాజా చేసిన పరుగులతో పోలిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా తక్కువ చేశాడు. దేశవాళీల్లో భారీ పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో తేలిపోతారు. మనం ఎప్పుడూ గొప్ప ఆటగాళ్లమని రాసి ఉండదు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంలోనే గొప‍్పతనం ఉంటుంది. ఈ సీజన్‌ సమ్మర్‌ క్రికెట్‌ ఆరంభమైన తర్వాత ఖవాజాకు అవకాశం వస్తుంది. అక్కడ నిరూపించుకుని మళ్లీ అవకాశం కోసం వేచిచూడాలి. ఒకవేళ మళ్లీ ఆడే అవకాశం వస్తే.. అప్పుడైనా నిరాశపరచడనే అనుకుంటున్నా' అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

ఆసీస్ తరఫున 44 టెస్టులు, 40 వన్డేలు

ఆసీస్ తరఫున 44 టెస్టులు, 40 వన్డేలు

ఉస్మాన్‌ ఖవాజా ఆసీస్ తరఫున ఇప్పటివరకూ 44 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీతో 1,554 పరుగులు చేయగా.. టెస్టుల్లో 8 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలతో 2,887 పరుగులు చేశాడు. అయితే ఈ తరహా ప‍్రదర్శన సరిపోదు అని పాంటింగ్ అంటున్నాడు. గతేడాది యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మధ్యలో జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఖ‌వాజాతో పాటు పీట‌ర్ హ్యాండ్స్‌కోంబ్‌, మార్క‌స్ హ‌రీస్‌, షాన్ మార్ష్‌, మార్క‌స్‌ స్టొయినిస్‌, నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. వీరి స్థానాల్లో కొత్త‌గా మార్న‌స్ ల‌బుషేన్‌, ఆస్ట‌న్ ఆగ‌ర్‌, జో బ‌ర్న్స్‌, మిషెల్ మార్ష్‌, మాథ్యూ వెడ్‌, కేన్ రిచ‌ర్డ్‌స‌న్ కొత్త‌గా కాంట్ర‌క్ట్ పొందారు.

Story first published: Monday, May 18, 2020, 15:07 [IST]
Other articles published on May 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X