న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌ను భలే వెనకేసుకొచ్చిన రికీ పాంటింగ్.. పాపం కుర్రాడు ఇప్పుడిప్పుడే కెప్టెన్సీ నేర్చుకుంటున్నాడట!

Ricky Ponting defending Rishabh Pants captaincy despite making mistakes in a row

ముంబై ఇండియన్స్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 నుంచి ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్ వీరవిహారం చేయడంతో ఢిల్లీ ఓటమిపాలయింది. అయితే ఛేజింగ్లో డేవిడ్ బ్యాటింగ్ దిగిన తొలి బంతికే కీపర్‌ క్యాచ్‌గా ఔటవ్వాల్సింది. కానీ ఆ క్యాచ్ కోసం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రివ్యూ తీసుకోకపోవడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. ఇక పంత్ డీఆర్ఎస్ కోరకపోవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఢిల్లీ ప్లేఆఫ్ చేరకపోవడానికి కారణం కెప్టెన్ రిషబ్ పంత్‌ అంటూ నిందిస్తున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం పంత్‌ను వెనకొసుకొచ్చాడు.

ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కెప్టెన్ అంటే మామూలు కాదు

ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కెప్టెన్ అంటే మామూలు కాదు

పాంటింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ జట్టును నడిపించడానికి పంత్ సరైన వ్యక్తి అనే అభిప్రాయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. అతను కెప్టెన్సీ చేపట్టినప్పటి నుండి మంచి ఆటతీరు, కెప్టెన్సీ కనబరిచాడని తెలిపాడు. ఇక గత సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కాలర్‌బోన్ విరిగిపోవడంతో పంత్ ఢిల్లీ కెప్టెన్సీని చేపట్టవలసి వచ్చింది. 2021సీజన్‌లో హాఫ్ ఆఫ్ ది సీజన్ పంత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. 'అతను ఓ యంగ్ ప్లేయర్. ఇప్పుడిప్పుడే కెప్టెన్సీ నేర్చుకుంటున్నాడు. టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉండటమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి అధిక ఒత్తిడితో కూడిన టోర్నమెంట్‌లో కెప్టెన్సీ చేయడం మాటలు కాదు. ఇక్కడేంటంటే దురదృష్టవశాత్తు మీరు చేసే ప్రతి పనిని అభిమానులు, క్రికెట్ ప్రపంచం గమనిస్తుంది. చిన్న తప్పు దొర్లినా దాన్ని ఎత్తిచూపేవారే ఎక్కువ ఉంటారు. నా వరకు పంత్‌కు కచ్చితంగా నా పూర్తి మద్దతు ఉంటుంది' అని పాంటింగ్ తెలిపాడు.

ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి

ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి

ఇంకా పాంటింగ్ మాట్లాడుతూ.. 'అతను ఇంకా చాలా నేర్చుకోవడానికి వీలుంది. అతను మ్యాచ్ పరిస్థితిని బాగా అవగాహన చేసుకుంటాడు. ఇక ఒక్కోసారి పొరపాట్లు జరగవచ్చు. అయినా సరే ఆ పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి కానీ మన కెప్టెన్సీ తప్పనే అనుమానాన్ని దరిచేరనీయకూడదు. అతను తప్పకుండా తర్వాతి సీజన్లో మరింత మెరుగ్గా తిరిగొస్తాడు' అని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఇక పోతే నిన్నటి మ్యాచ్‌లో సరిగ్గా గేమ్‌ను ముగించడంలో ఢిల్లీ విఫలమైందని పాంటింగ్ అంగీకరించాడు.

చాలా కష్టాలు ఎదుర్కొన్నాం

చాలా కష్టాలు ఎదుర్కొన్నాం

ఇక రికీపాంటింగ్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కష్టాలు ఎదురైనట్లు పేర్కొన్నాడు. 'మా జట్టు కోవిడ్, గాయాలు, ఇతర అనారోగ్య కారణాలతో కాస్త జట్టులో డిస్ట్రర్బెన్స్ నెలకొంది. అన్ని రకాల ఇబ్బందులు కలిగి ఉన్నా ఎలాంటి అంతరాయం లేకుండా ఈ సీజన్‌ను మేం మంచిగా ఆడగలిగినాం అనుకుంటున్నాం. ఢిల్లీకి అప్ అండ్ డౌన్ సీజన్లలో ఈ సీజన్ ఒకటి' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

దెబ్బతీసిన కరోనా, గాయాలు

దెబ్బతీసిన కరోనా, గాయాలు

ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఈ సీజన్ మధ్యలో కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే. మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ లాంటి ప్లేయర్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. అలాగే రికీ పాంటింగ్ సైతం ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఓపెనర్ పృథ్వీ షా, అక్షర్ పటేల్ అనారోగ్యం, గాయాల కారణంగా కొన్ని మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక అన్నీ సద్దుమణిగాయనుకున్న తరుణంలో ఆటలో చిన్న చిన్న మిస్టేక్స్ ఢిల్లీ పరాభవానికి కారణాలయ్యాయి. పంత్ కెప్టెన్‌గా తదుపరి సీజన్‌లో తిరిగి రావడానికి తాను ఎదురుచూస్తున్నానని పాంటింగ్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, May 22, 2022, 16:25 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X