న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ricky Ponting : ఆస్ట్రేలియా, ఇండియా అభిమానులు ఎంజాయ్ చేస్తారు.. ఐసీసీ మంచి నిర్ణయం తీసుకుంది

Rickey Ponting Welcomed The ICCs Decision Of Making Border Gavaskar Trophy as 5 Test Series

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా చేయాలనే ఐసీసీ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్వాగతించారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లను చూడ్డానికి అభిమానులు ఇష్టపడతారని పాంటింగ్ పేర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2004-05 ఆస్ట్రేలియా పర్యటన నుంచి.. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌గా సాగుతోంది. 2010-11లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు సిరీస్ మాత్రమే జరిగింది. ఐసీసీ ప్రకటించిన కొత్త ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ 2023-27లో జరగబోయే రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌‌లు జరుగుతాయి.

'ఆస్ట్రేలియా, భారత్ ప్రేక్షకులు, అలాగే క్రికెట్ అభిమానులు సైతం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లను చూడటాన్ని ఎంజాయ్ చేస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి కచ్చితంగా ఇది మంచి నిర్ణయం' అని పాంటింగ్ ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య సిరీస్ చాలా భిన్నంగా ఉంటుంది. భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఫాస్ట్, బౌన్సీ వికెట్లను ఆ జట్టు ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా భారత్‌కు వెళ్లినప్పుడు అక్కడ స్పిన్, రివర్స్ స్వింగ్ బౌలింగ్‌‌ను ఆస్ట్రేలియా ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ వ్యత్యాసమే ఆటగాళ్లకు కూడా కూడా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అందువల్ల అభిమానులు కూడా ఆసీస్, ఇండియా మధ్య టెస్ట్ సిరీస్లను చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారని నేను భావిస్తున్నాను' అని రికీ పేర్కొన్నాడు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​సైకిల్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత్‌ను స్వాగతిస్తుంది. అలాగే 2025-27 సైకిల్‌లో ఆస్ట్రేలియాకు భారత్ వెల్ కమ్ చెబుతుంది. 1992తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత్‌లు తలపడడం 30ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇకపోతే ఐసీసీ ప్రకటించిన తాజా ఎఫ్టీపీ 2023-27 షెడ్యూల్లో మొత్తం 777అంతర్జాతీయ మ్యాచ్‌లు 12 సభ్యదేశాలు ఆడుతాయి. అందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 T20లు ఉన్నాయి.

Story first published: Wednesday, August 17, 2022, 18:25 [IST]
Other articles published on Aug 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X