న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంఫైర్ల జీతాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే

Eye-Popping Yearly Salary Of ICC Umpires And Other Benefits || Oneindia Telugu
Revealed! Eye-popping yearly salary of ICC umpires and other

హైదరాబాద్: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్‌లో క్రికెట్ ఒకటి. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. క్రికెట్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల అభిమానులు నిశితంగా గమనిస్తుంటారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఇందులో క్రికెటర్ల జీవితాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న కారణంగా అంపైర్లు కూడా స్కానర్ కిందకు వచ్చారు. దీంతో క్రికెట్‌లో క్వాలిటీ అంఫైరింగ్‌ ఉండాలంటూ ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయలను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

అంఫైర్ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు

అంఫైర్ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అంఫైర్ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ టోర్నీల్లో అంపైరింగ్ చేసినందుకు గాను అంఫైర్లు ఎంత మొత్తంలో జీతాలు తీసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంఫైరింగ్ చేసినందుకు గాను అంపైర్లకు పెద్ద మొత్తంలో అందుతుంది. తాజాగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంఫైర్లకు ఇచ్చే జీతాల వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న అంఫైర్లకు సంవత్సరానికి ఐసీసీ 35,000 యుఎస్ డాలర్లు (రూ 24,00,000 approx) నుంచి 45,000 యుఎస్ డాలర్లు (రూ. 31,00,000 approx) చెల్లిస్తోంది.

మ్యాచ్ ఫీజులు అదనం

మ్యాచ్ ఫీజులు అదనం

దీనికి తోడు టెస్టు మ్యాచ్‌లు జరిగే సమయాల్లో మ్యాచ్ ఫీజులు 3,000 యుఎస్ డాలర్లు(రూ 2,00,000 approx) అదనం. ఇక, టీ20 మ్యాచ్‌ల విషయానికి వస్తే 1000 యుఎస్ డాలర్లు (రూ 70,000 approx), వన్డేలకు గాను 2200 యుఎస్ డాలర్లు (రూ. 1,50,000 approx) ఐసీసీ చెల్లిస్తోంది. ఇదిలా ఉంటే, 2019-20 సీజన్‌కు ఐసీసీ ప్రకటించిన ఎలైట్ ప్యానెల్ అంఫైర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిథ్యం దక్కలేదు. ఇప్పటివరకు ఐసీసీ ఎలైట్‌ అంపైర్ల ప్యానెల్‌ జాబితాలో భారత్ నుంచి ఉన్న ఒకే ఒక్కడు రవి సుందరం కూడా ఉద్వాసనకు గురయ్యాడు.

భారత్‌కు లేని ప్రాతినిధ్యం

భారత్‌కు లేని ప్రాతినిధ్యం

జాబితాలో ఉన్న ఆ ఒక్కడిని ఐసీసీ తప్పించడంతో ఎలైట్‌ అంపైర్ల ప్యానెల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మైదానంలో, టీవీ అంపైర్‌గా పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలకు గురైన రవి సుందరంపై ఐసీసీ వేటు వేసింది. 53 ఏళ్ల రవి 33 టెస్టులు, 48వ వన్డేలు, 18 టీ20ల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. వార్షిక సమీక్ష, ఎంపిక ప్రక్రియలో భాగంగా మంగళవారం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంఫైర్ల జాబితాను ప్రకటించింది. తాజాగా ఇద్దరు కొత్త అంపైర్లు మైకెల్‌ గాఫ్‌ (ఇంగ్లాండ్‌), జోయల్‌ విల్సన్‌ (వెస్టిండీస్‌)లకు ప్యానెల్‌లో చోటు దక్కింది. కొత్తగా అంఫైర్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న ఇద్దరు అంఫైర్లకు అంతర్జాతీయ అనుభవం ఉంది.

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌‌ అంపైర్లు వీరే

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌‌ అంపైర్లు వీరే

మైకెల్‌ గాఫ్‌ ఇప్పటివరకు 9 టెస్టులు, 59 వన్డేలు, 14 టీ20లకు అంఫైర్‌గా వ్యవహారించారు. ఇక, జోయల్‌ విల్సన్‌ 13టెస్టులు, 63 వన్డేలు, 26 టీ20లకు అంఫైర్‌గా వ్యవహారించారు. ఈ ఇద్దరూ గత ప్యానెల్‌లో అంఫైర్లుగా ఉన్న ఇయాన్ గోల్డ్, రవి సుందరంలను భర్తీ చేస్తారని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌‌ అంపైర్లు వీరే:

అలీమ్ దార్, కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, నిగెల్ లాంగ్, బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్, పాల్ రీఫెల్, రాడ్ టక్కర్, మైకెల్‌ గాఫ్‌, జోయల్‌ విల్సన్‌

ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలు:

డేవిడ్ బూన్, క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, రంజన్ మదుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్

Story first published: Wednesday, July 31, 2019, 13:30 [IST]
Other articles published on Jul 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X