న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ మ్యాచ్‌లో: 1996 వరల్డ్ కప్ సన్నివేశం రిపీట్ (వీడియో)

Remember the Sweet Revenge From 1996 World Cup? Venkatesh Prasad and Aamer Sohail Just Recreated it

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు శత్రువుల్లా పోరాడతారు. మైదానం బయట మాత్రం స్నేహితుల్లాగా కలిసిపోతారు. గతేడాది ఓవల్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడిన అనంతరం కనిపించిన దృశ్యమిది.

హ్యాపీ బర్త్‌డే వెంకటేశ్ ప్రసాద్: అరుదైన వీడియోని షేర్ చేసిన బీసీసీఐహ్యాపీ బర్త్‌డే వెంకటేశ్ ప్రసాద్: అరుదైన వీడియోని షేర్ చేసిన బీసీసీఐ

ఇలా దాయాదుల మధ్య శత్రుత్వం గురించి చెప్పుకుంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది 1996 వరల్డ్‌కప్‌లో ఆమిర్‌ సొహైల్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ మధ్య చోటు చేసుకున్న కవ్వింపులు. ఎప్పటికీ అందరికీ గుర్తుండే సన్నివేశమంది. సుమారు 22 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ ఆసియాకప్‌ సందర్భంగా ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

 1996 వరల్డ్‌ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌

1996 వరల్డ్‌ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌

1996 వరల్డ్‌ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌. సెమీస్ బెర్త్ కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎంతో కీలకమ్యాచ్ కావడంతో ఈ పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 286 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు సయ్యద్‌ అన్వర్, అమీర్‌ సోహైల్ తొలి 10 ఓవర్లలో 84 పరుగులు చేశారు.

వరుస బౌండరీలు బాది సోహైల్‌

వరుస బౌండరీలు బాది సోహైల్‌

అన్వర్‌ ఔటైన తర్వాత సోహైల్‌ మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో సోహైల్ వరుస బౌండరీలు బాది వెంకటేష్‌ ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు. ఈ క్రమంలో వెంకటేశ్ ప్రసాద్ వేసిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌లో కొట్టి 'మళ్లీ అక్కడికే కొడతా... వెళ్లి తెచ్చుకో' అంటూ బ్యాట్‌ను అతడి ముఖంవైపు చూపుతూ ఎగతాళి చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్ ఆ తర్వాతి బంతిని ఆఫ్‌ స్టంప్ బయటకు వేశాడు. అంతే బంతిని టచ్ చేయబోయిన సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

 'బాస్టర్డ్... గో హోమ్' అన్న వెంకటేశ్ ప్రసాద్

'బాస్టర్డ్... గో హోమ్' అన్న వెంకటేశ్ ప్రసాద్

ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకటేశ్ ప్రసాద్ 'బాస్టర్డ్... గో హోమ్' అంటూ పెవిలియన్ వైపు దారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 39 పరుగులు తేడాతో విజయం సాధించింది. తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో క్రికెట్‌ కామెంటేటర్లుగా పనిచేస్తోన్న ఆమిర్‌ సొహైల్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ మళ్లీ కలిశారు. ఆనాటి సంఘటన గురించి గుర్తుచేసుకున్నారు.

రౌండ్‌ ది వికెట్‌ తీసుకొని రెండో స్పెల్‌

రౌండ్‌ ది వికెట్‌ తీసుకొని రెండో స్పెల్‌

"వెంకీ రౌండ్‌ ది వికెట్‌ తీసుకొని రెండో స్పెల్‌ను కట్టుదిట్టంగా వేస్తున్నాడు. అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. చాలా శ్రద్ధగా బౌలింగ్‌ వేస్తున్న అతడిని చిరాకు పెట్టాలనుకున్నా. ఒక బౌలర్‌ పదేపదే నిన్ను విసిగిస్తుంటే అతడిని కాస్త చిరాకు పెట్టమని జావెద్‌ నేర్పించాడు. అయినప్పటికీ వెంకీ ఏ మాత్రం డిస్ట్రబ్‌ అవ్వలేదు. ఇంకా కట్టుదిట్టంగా బంతులు వేశాడు. అప్పుడు నేను బౌన్సర్‌ ఊహించి బాదేందుకు సిద్ధంగా ఉన్నా" అని ఆమిర్‌ చెప్పాడు.

అతడి సంజ్ఞల అర్థమేంటో నాకు అర్థం కాలేదు

సొహైల్‌ కవర్‌ వైపు చూపించడంతో తర్వాతి బంతినీ అదే వైపు బాదుతాడేమో అని భావించానని వెంకటేశ్ ప్రసాద్ చెప్పాడు. అతడి సంజ్ఞల అర్థమేంటో తనకు అర్థం కాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాజాగా వీరిద్దరూ మళ్లీ అదే సీన్ ‌రిపీట్‌ చేశారు దుబాయిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో.

Story first published: Thursday, September 20, 2018, 19:27 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X