న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకి: నిలిచిన మ్యాచ్ (వీడియో)

Rain

హైదరాబాద్: బెంగళూరు వేదికగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి ఆర్సీబీని రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. వ‌ర్షం కార‌ణంగా అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చిరుజ‌ల్లులు కురుస్తుండ‌టంతో మైదానం సిబ్బంది పిచ్‌పై క‌వ‌ర్లు క‌ప్పి ఉంచారు. ఉదయం నుంచి బెంగళూరులో చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే, సాయంత్రానికి వరుణుడు తెరపినివ్వడంతో టాస్‌కు వేశారు. అయితే మళ్లీ జల్లులు కురుస్తుండటంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు.

దీంతో వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గిన త‌ర్వాత మ్యాచ్ ప్రారంభ‌మైతే ఓవ‌ర్ల‌ను కుదించే అవ‌కాశం ఉంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ టాస్ ఓడిపోవడం ఇది పదోసారి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగాయి. రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగగా... బెంగళూరు జట్టులో రెండు మార్పులు చేసింది.

1
45925

రాజస్థాన్ జట్టులో ఆస్టన్ టర్నర్ స్థానంలో మహిపాల్ లొమ్‌రొర్‌ తుది జట్టులో చోటు దక్కించుకోగా... ఆర్సీబీ జట్టులో పవన్ నేగి, కుల్వంత్‌లను తుది జట్టులోకి తీసుకుంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడుతున్నాయి.

చివరగా ఇరు జట్లు ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఆర్సీబీ టెక్నికల్‌గా చెప్పాలంటే ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. అయితే, ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప బెంగళూరు ప్లేఆఫ్స్ చేరే అవకాశం లేదు. మరోవైపు ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న రాజస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో తప్పకుండా విజయం సాధించాలి.

త‌దుప‌రి మ్యాచ్‌ల్లో రాజస్థాన్ భారీ తేడాతో విజ‌యాలు సాధిస్తేనే నెట్‌ ర‌న్‌రేట్ మెరుగుప‌డుతుంది. తద్వారా రాజస్థాన్ ప్లే‌ఆప్‌కు చేరుకుంటుంది. ఈ సీజన్‌లో స్టీవ్ స్మిత్‌కు బహుశా ఇదే ఆఖరి మ్యాచ్ కావొచ్చు. ఈ మ్యాచ్ అనంతరం వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. మరోవైపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ సీజన్‌ను ఘనంగా ముగించాలని కోహ్లీసేన భావిస్తోంది. సాంకేతికంగా ఆర్సీబీ ఇంకా ప్లేఆఫ్ రేసులోనే ఉంది.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

పార్ధీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్, పవన్ నేగి, నవదీప్ షైనీ, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్, గురుకీర్త్ మన్ సింగ్, కుల్వంత్ కేజ్రోలియా

రాజస్థాన్ రాయల్స్
అజ్యింకే రహానే, లియామ్ లింగ్ స్టోన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రేయాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి, మహిపాల్ లోమర్, వరుణ్ ఆరోన్, ఓషానే థామస్

Story first published: Tuesday, April 30, 2019, 22:50 [IST]
Other articles published on Apr 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X