న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: ఏబీడీ బ్లడ్ టెస్ట్ చేయాలి? .. మ్యాడ్ మ్యాక్సీ విధ్వంసంతో పంజాబ్ ముఖ చిత్రం ఏంటో!

RCB vs KKR: Twitter Reactions after Glenn Maxwell and AB de Villiers show

చెన్నై: అబ్రహమ్ బెంజమిన్ డివిలియర్స్(ఏబీడీ) మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 150 పరుగులే చేయడమే కష్టంగా మారిన పిచ్‌పై తనదైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మిస్టర్ 360.. మరో 7 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. మొత్తం 34 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా మ్యాడ్ మ్యాక్స్‌వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) రన్స్ చేయడంతో ఆర్‌సీబీకి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఆదుకున్న మ్యాక్సీ..

9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గ్లేన్ మ్యాక్స్‌వెల్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. షకీబ్ అల్ హసన్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన మ్యాక్సీ.. అతని మరుసటి ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో తన విధ్వంసాన్ని షురు చేశాడు. ప్రతీ ఓవర్‌లో బౌండరీ బాదుతూ స్కోర్ బోర్డును పరెగెత్తించాడు. బౌలర్లకు అంతుపట్టని స్విచ్ హిట్ షాట్లతో చెలరేగాడు. కమిన్స్ వేసిన 9వ ఓవర్‌ ఆఖరి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికిది ఈ సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ. అనంతరం మరింత ధాటిగా ఆడిన మ్యాక్సీ సెంచరీ చేస్తాడా? అనిపించింది. కానీ అతని జోరుకు మ్యాక్సీ అడ్డుకట్ట వేసాడు.

మొదలైన ఏబీడీ సునామీ..

మ్యాక్సీ ఔటైనా తర్వాత మైదానంలో ఏబీడీ సునామీ మొదలైంది. రస్సెల్ వేసిన 18 ఓవర్‌లో ఓ సిక్స్‌తో రెండు బౌండరీలు బాదిన ఏబీడీ.. హర్భజన్ బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ షాట్‌కు డగౌట్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా అంతా ఫిదా అయ్యారు. రస్సెల్ వేసిన చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 21 పరుగులు పిండుకొని జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. అతనికి తోడుగా జేమీసన్(11 నాటౌట్) రాణించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు తేలిపోయారు. పోటిపడి మరి పరుగులు సమర్పించుకున్నారు.

ఏబీడీ బ్లడ్ టెస్ట్ చేయాలి..

ఏబీడీ విధ్వంసంపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ అభిమాన జట్లతో సంబంధంలేకుండా అతన్ని ఆటను కొనియాడుతున్నారు. ఓ అభిమాని అయితే ఏబీ డివిలియర్స్ బ్లడ్‌ను పరీక్షించాలని, అతను మనిషే కాదని, అపూరప శక్తి ఏదో ఉందని ట్వీట్ చేశాడు. ఏబీడీ విధ్వంసం మొదలైందని ఈ సారి ఆర్‌సీబీ దూసుకెళ్తుందని మరికొందరు కామెంట్ చేశారు. ఇక అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం అతని ఆటకు ఫిదా అవుతున్నారు. వయసు పెరిగే కొద్ది ఏబీడీ ఆట మరింత మెరుగవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఏబీడీ విధ్వంసాన్ని వివరించేందుకు మాటల్లేవ్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.

మారాజువి నీవేనయ్యా మ్యాక్సీ..

ఇక మ్యాక్సీ ఇన్నింగ్స్‌ను కూడా అభిమానులు కొనియాడుతున్నారు. కష్టాల్లో ఉన్న జట్టును మ్యాక్సీ తన సూపర్బ్ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడని ప్రశంసిస్తున్నారు. అతని ఆట 2014 సీజన్‌ను గుర్తు చేస్తుందని, ఈ సారి ఆర్‌సీబీ ఫైనల్ చేరడం పక్కా అని కామెంట్ చేస్తున్నారు. ఆర్‌సీబీ అభిమానులైతే మా ఆశలు, మా రాజువి నీవేనయ్యా మ్యాక్సీ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక కింగ్స్ పంజాబ్ ముఖ చిత్రం ఏంటనే మీమ్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు. పంజాబ్ తరఫున దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. ఆర్‌సీబీ తరఫున చెలరేగడానికి గల కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Story first published: Sunday, April 18, 2021, 18:35 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X