Ravindra Jadeja భార్యపై ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు.. చిచ్చు రేపిన ఎన్నికలు!

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబంలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. జడేజా సతీమణి రివాబా జడేజా బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండగా.. ఆమెకు వ్యతిరేకంగా అతని సోదరి నైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వదినా-మరదళ్ల పోటా పోటీ ప్రచారం జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మరింత పెంచింది. ఇద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను వాడుకుంటోందని వదిన రివాబా జడేజాపై నైనా మండిపడ్డారు. చిన్న పిల్లలతో కూడా ప్రచారం చేయిస్తున్నారని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ తరఫున సోదరి..

కాంగ్రెస్ తరఫున సోదరి..

ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని లబ్ధి పొందేందుకు రివాబా ప్రయత్నిస్తున్నారని నైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించేలా ఆమె వ్యవహార శైలి ఉందని మరదలిపై ధ్వజమెత్తారు. అంతేకాదు రివాబాకు వెస్ట్ రాజ్‌కోట్‌లో ఓటు హక్కు ఉందని.. అలాంటప్పుడు జామ్‌నగర్ నార్త్ నుంచి ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి బిపింద్రసిన్హ్ జడేజాని గెలిపించాలని ఓటర్లకు నైనా విజ్ఞప్తి చేశారు. స్థానికేతురులకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. రివాబా జడేజా పెళ్లయ్యాక కూడా ఇంటిపేరు మార్చుకోలేదని నైనా విమర్శలు గుప్పించారు.

 రూ.97 కోట్ల ఆస్థి..

రూ.97 కోట్ల ఆస్థి..

రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. రవీంద్ర జడేజా భార్య 1990లో జన్మించారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. కాంగ్రెస్‌కు చెందిన హరి సింగ్ సోలంకి మేనకోడలు. ఆమెను రివా సోలంకి అని కూడా పిలుస్తారు. రివాబా మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను 2016లో రివాబా పెళ్లి చేసుకున్నారు. రివాబా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. రివాబా జడేజా ఆస్తుల విలువ రూ.97 కోట్లు.

 టికెట్ ఆశించినప్పటికీ..

టికెట్ ఆశించినప్పటికీ..

ఇక జడేజా సోదరి నైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. జామ్ నగర్ జిల్లాలో ఆమెకు మంచి పేరే ఉంది. అంతేకాదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ఆమె ప్రచారం చేస్తున్నారు. జామ్ నగర్ నార్త్ టికెట్ నైనాకే వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. కాంగ్రెస్ హైమాండ్ మాత్రం బిపింద్ర సిన్హ్ జడేజా వైపే మొగ్గు చూపారు. ఆయన గెలుపు కోసం నైనా తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 గాయంతో జట్టుకు దూరం..

గాయంతో జట్టుకు దూరం..

ఆసియా కప్‌లో ఆడుతున్న సమయంలోనే రవీంద్ర జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. దీంతో బౌలింగ్ చేయడం కూడా కష్టంగా మారడంతో అతను ఆసియా కప్ మధ్యలోనే జట్టును వీడి ఆస్పత్రికి వెళ్లాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ కారణంగానే అతను టీ20 వరల్డ్ కప్, న్యూజిల్యాండ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అతనుల లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే బంగ్లా పర్యటన సమయానికి జడ్డూ కూడా పూర్తిగా కోలుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 23, 2022, 20:41 [IST]
Other articles published on Nov 23, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X