న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫీల్డింగ్‌లో కోహ్లీ-జడేజాల మధ్య రేసు గెలిచిందెవరు?(వీడియో)

Ravindra Jadeja defeats Virat Kohli in on-field race while chasing the ball - watch video

హైదరాబాద్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంత ఫిట్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. తొలుత కోహ్లీ పేరే వినిపిస్తోంది. అలాంటి కోహ్లిని నిన్న బ్రబౌర్న్ స్టేడియంలో రవీంద్ర జడేజా ఓడించేశాడు. ఫీల్డింగ్‌లో బంతి కోసం జరిగిన ఈ పరుగు రేస్‌లో.. తొలుత వెనకబడినట్లు కనిపించిన జడేజా.. ఆఖర్లో కోహ్లీని అధిగమించినట్లు కనిపించాడు.

భువనేశ్వర్ బౌలింగ్‌లో చంద్రపాల్ కవర్స్ దిశగా:

కోహ్లీ కంటే వేగంగా పరిగెత్తి బంతిని అందుకున్నాడు. ఇలా కొందరు అంటుంటే ఇద్దరు కలిసి బౌండరీకి వెళ్లే బంతిని ఆపారని మరి కొందరు అంటున్నారు. ఇప్పుడు ఈ రేస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ బంతిని కవర్స్ దిశగా హిట్ చేశాడు.

 బౌండరీకి వెళ్తున్న దాన్ని నిలువరించేందుకు:

బౌండరీకి వెళ్తున్న దాన్ని నిలువరించేందుకు:

దీంతో.. జడేజా, విరాట్ కోహ్లి మధ్యలో పడిన బంతి బౌండరీకి వెళ్తుండగా.. దాన్ని నిలువరించేందుకు ఇద్దరూ ఒకేసారి పరుగు అందుకున్నారు. ఈ క్రమంలో కొన్ని క్షణాల పాటు ఇద్దరూ పక్కపక్కనే పోటాపోటీగా పరుగెత్తారు. అయితే.. మధ్యలో జోరుపెంచిన జడేజా.. కోహ్లీని దాటుకుని వెళ్లి కింద జారుకుంటూ బంతిని అందుకున్నాడు. అలా వెళ్తున్న బంతిని దాన్ని కోహ్లీకి అందించాడు. వెంటనే ఆ బంతిని ధోనీకి అందించారు.

50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377

50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సులు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులతో) సెంచరీలు సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది.

153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్

153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 36.2 ఓవర్లలో 153 పరుగులకే పేలవరీతిలో కుప్పకూలిపోయింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో నిలవగా.. తిరువనంతపురం వేదికగా గురువారం మధ్యాహ్నం ఐదో వన్డే జరగనుంది.

Story first published: Tuesday, October 30, 2018, 17:02 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X