న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇందులో అశ్విన్ తప్పేం లేదు.. : పూజారా

Ravichandran Ashwin kept bowling in the right areas: Cheteshwar Pujara

సౌతాంప్టన్: ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్ పెర్ఫార్మెన్స్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పూజారా దన్నుగా నిలబడ్డాడు. జోస్‌బట్లర్ హాఫ్ సెంచరీతో ఇంగ్లాండ్ 233 ఆధిక్యానికి చేరడం తెలిసిందే. మరోపక్క మొయిన్ అలీ ఐదు వికెట్లు తీసి భారత్‌ను పూర్తిగా నిలువరించాడు. ఈ పరిస్థితుల్లో అశ్విన్ 35 ఓవర్లలో వికెట్ తీసుకుని 75 పరుగులిచ్చాడు. దీనిపై వస్తున్న విమర్శలను పూజారా ఖండించాడు.

'అశ్విన్ ఎక్కువ వికెట్లు తీయనంత మాత్రాన బాగా ఆడలేదని ఎలా అంటాం. అతను సరైన ఒరవడిలోనే బంతులు విసిరాడు. ఎక్కువ వికెట్లు తీసే సందర్భాలు బౌలర్లకు అన్నిసార్లూ దక్కవు' అని అశ్విన్‌ను పూజారా సమర్థించాడు. 'పిచ్ కూడా ఒక్కసారిగా స్లో అయ్యింది. కొన్ని బంతులు బౌలర్లు ఆశించినంత వేగంతో వెళ్లలేదు' అన్నాడు. గురువారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకి కుప్పకూలగా.. భారత్ జట్టు 273 పరుగులకి ఆలౌటైంది.

దీంతో.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 271 పరుగులకి ఆలౌటవడంతో భారత్ ముందు 245 పరుగుల టార్గెట్ నిలిచింది. కానీ.. లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత్ 69.4 ఓవర్లలో 184కే కుప్పకూలిపోయింది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ జట్టు పేలవరీతిలో చేజార్చుకుంది. సౌతాంప్టన్‌ వేదికగా ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో 245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 184 పరుగులకే కుప్పకూలిపోయింది.

కెప్టెన్ విరాట్ కోహ్లి (58) 130 బంతుల్లో 4ఫోర్లు, వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51) 159 బంతుల్లో అసాధారణ పోరాటంతో గెలుపుపై ఆశలు రేపినా.. మిగతా బ్యాట్స్‌మెన్స్‌ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో.. భారత్‌కి 60 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-1తో కైవసం చేసుకోగా.. సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి జరగనుంది.

Story first published: Monday, September 3, 2018, 18:42 [IST]
Other articles published on Sep 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X