న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది నిజమని తేలితే.. రవిశాస్త్రి నియమకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం!!

Ravi Shastri Will Reappointed if CAC Found Guilty Of Conflict Of Interest

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా ఇటీవల తిరిగి ఎన్నికయిన రవిశాస్త్రికి షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేయడమే ఆయనకు సరికొత్త తలనొప్పిగా మారింది. సీఏసీ సభ్యులు కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామీలు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారని తేలితే.. రెండోసారి ఎంపికైన రవిశాస్త్రి నియమకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

<strong>IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌.. మార్పుల్లేకుండానే భారత్?!!</strong>IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌.. మార్పుల్లేకుండానే భారత్?!!

సీఏసీ సభ్యులకు నోటీసులు

సీఏసీ సభ్యులకు నోటీసులు

సీఏసీ సభ్యులు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి చెందిన సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో డీకే జైన్‌ శనివారం సీఏసీ సభ్యులకు నోటీసులు పంపాడు. దీంతో రవిశాస్త్రి అంశం తెరపైకి వచ్చింది. అయితే కపిల్ కమిటీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తే.. రవిశాస్త్రి తన పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో రవిశాస్త్రి నియమకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియను తిరిగి చేపట్టాలి

ఎంపిక ప్రక్రియను తిరిగి చేపట్టాలి

బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... 'సీఏసీ సభ్యులు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారని తేలితే మాత్రం రవిశాస్త్రి అనవసరంగా ఈ వివాదంలో చిక్కుకుంటాడు. శాస్త్రి ఎంపిక ప్రక్రియను తిరిగి చేపట్టాల్సి ఉంటుంది. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీఏసీ సభ్యులు మాత్రమే టీమిండియా కోచ్‌ని ఎంపిక చెయ్యాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సభ్యులు విరుద్ధ ప్రయోజనాలు పొందితే.. కొత్తగా ఏర్పడే క్రికెట్‌ సలహా కమిటి తిరిగి కోచ్‌ ఎన్నుకోవాల్సి ఉంటుంది' అని పేర్కొన్నాడు. గతేడాది తాత్కాలిక సభ్యులుగా ఉన్న కపిల్‌ కమిటీ మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ని సైతం ఎంపిక చేశారు. దీంతో రామన్‌ సైతం ఈ వివాదంలోకి రానున్నాడు.

సీఓఏలో భిన్న వాదనలు

సీఓఏలో భిన్న వాదనలు

ప్రధాన కోచ్‌ను సీఏసీ ఎంపిక చేయడంపై సీఓఏలో భిన్న వాదనలు వినిపించాయి. సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ప్రధాన కోచ్‌ ఎంపిక పూర్తిగా కపిల్‌ కమిటీనే చూసుకుంటుందని చెప్పగా.. ఎడ్జుల్లీ మాత్రం విభేదించారు. ఇది బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. చివరకు సీఏసీనే ప్రధాన కోచ్‌ ఎంపికను చేపట్టింది. ఇప్పుడు విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు డీకే జైన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌గా నియామకం జరిగిన తర్వాత కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Sunday, September 29, 2019, 15:56 [IST]
Other articles published on Sep 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X