న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: షిరిడి సాయిబాబా ఆశీస్సులు తీసుకున్న రవిశాస్త్రి

Ravi Shastri visits Shirdi temple with coach R Sridhar to seek blessings for successful ICC World Cup 2019

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సోమవారం షిరిడి సాయిబాబా టెంపుల్‌ను దర్శించారు. వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్‌కు టీమిండియాతో కలిసి పయనం కావడానికి ముందు రవిశాస్త్రి ప్రత్యేక చాపర్‌లో షిరిడి వెళ్లి బాబాను దర్శించుకున్నారు. ఈ క్రమంలో రవిశాస్త్రి వెంట ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లు ఉన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

సుమారు ఏడు వారాల పాటు జరగనున్న వరల్డ్‌కప్ క్యాంపెయిన సజావుగా జరగాలని కోరుకుంటా సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నట్లు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌లతో కలిగి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

ఆర్ శ్రీధర్ తన పోస్టులో రేమాండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింగానియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. అందుకు కారణం వీరి పర్యటన దిగ్విజయంగా పూర్తి కావడానికి కారణమైన చాపర్‌ను ఆయనే సమకూర్చారంట. శ్రీధర్ తన పోస్టులో "గౌతమ్ సింగానియాకు భిగ్ థ్యాంక్స్. వరల్డ్‌కప్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లడానికి ముందు బాబా ఆశీస్సులు తీసుకోవడంలో సాయపడ్డారు" అని ట్వీట్ చేశారు.

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మే22న టీమిండియా ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. కాగా, ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలు వరల్డ్‌కప్ సన్నద్ధపై వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ "ఆటను ఎంజాయ్ చేస్తే కప్పు మనదే. వరల్డ్‌కప్‌ లాంటి టోర్నీల్లో ఎంజాయ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడాలి. సామ‌ర్థ్యం మేరకు రాణిస్తే వరల్డ్‌కప్ మనదే. ఈ టోర్నీలో గట్టిపోటీనే ఉంటుంది. 2015తో పోలిస్తే బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌ జట్లు చాలా బలమైన జట్లుగా అవతరించాయి" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ధోనిపై అడిగిన ప్రశ్నకు "ఈ టోర్నీలో ధోనీ పాత్ర చాలా కీలకం. ఈ ఫార్మాట్‌లో అతనికన్నా గొప్ప ఆటగాడు ఎవరూ లేరు. క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పే క్షణాల్లో అతడి అనుభవం చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతనొక గొప్ప క్రికెటర్‌" అని రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

Story first published: Tuesday, May 21, 2019, 18:33 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X