న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: వాషింగ్టన్‌ సుందర్‌ గురించి.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌తో మాట్లాడతా: రవిశాస్త్రి

Ravi Shastri said Going to ask Dinesh Karthik to make Washington Sundar bat in top four

అహ్మదాబాద్: టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొలి ఇన్నింగ్సులో రిషబ్ పంత్‌తో కలిసి జట్టును ఆదుకున్న సుందర్.. 60 పరుగులు చేసి భారత్‌ ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు టెస్ట్ సిరీస్‌లో వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో సుందర్‌లో సహజంగానే చాలా సత్తా ఉందని రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. 80ల్లో తాను సేవలందించినట్లే సుందర్‌ ప్రస్తుత భారత జట్టుకు ఉపయోగపడుతున్నాడు అని హెడ్ కోచ్ పేర్కొన్నాడు. రిషబ్‌ పంత్, అక్షర్‌ పటేల్, సుందర్‌ ప్రదర్శనపై ఆదివారం వర్చువల్‌ విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను శాస్త్రి పంచుకున్నాడు.

నాలానే సుందర్‌:

నాలానే సుందర్‌:

80ల్లో అప్పటి కెప్టెన్లు సునీల్‌ గావస్కర్, కపిల్‌ దేవ్‌లకు నేను సేవలందించినట్లే.. వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుత భారత జట్టుకు ఉపయోగపడుతున్నాడు. నాతో పోలిస్తే సుందర్‌కు సహజసిద్ధమైన నైపుణ్యం మరింత ఎక్కువ. టెస్టుల్లో బౌలింగ్‌పై దృష్టి పెడితే.. అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. విదేశీ పిచ్‌లపై భారత్‌కు దొరికిన మెరుగైన ఆరో నంబర్‌ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. లోయర్‌ఆర్డర్‌లో అర్ధ సెంచరీలు చేయడం.. 20 ఓవర్లు వేసి రెండు మూడు వికెట్లు తీయడమే నా పాత్ర. ఇప్పుడు సుందర్‌ ఇదే పాత్రను సమర్థంగా పోషించగలడు. అయితే దేశవాళీలో తమిళనాడుకు ఆడేటప్పుడు అతడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తొలి నాలుగు స్థానాల్లో రావాలి. తమిళనాడు కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌తో ఈ విషయం గురించి మాట్లాడతా' అని శాస్త్రి అన్నాడు.

అక్షర్‌ జట్టుకు కొత్త ఆటగాడేం కాదు:

అక్షర్‌ జట్టుకు కొత్త ఆటగాడేం కాదు:

'23 ఏళ్లలోపే రిషబ్‌ పంత్‌ నాలాగే విదేశాల్లో విజయవంతం అయ్యాడు. ఇటీవల పంత్‌ చాలా బరువు పెరిగాడు. జిమ్‌లో శ్రమించి బాగా తగ్గాడు. ఆఫ్‌సైడ్‌ ఆటలోనూ మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తోంది శ్రమ ఆ ఫలితాలే. తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడితే పంత్‌ తిరుగులేని మ్యాచ్‌ విన్నర్‌. ఆఫ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ జట్టుకు కొత్త ఆటగాడేం కాదు. చాలా ఏళ్లుగా జట్టుతోనే ఉంటూ వస్తున్నాడు. కానీ గాయాలు కావడంతో దురదృష్టం కొద్దీ జట్టుకు దూరమయ్యాడు. అందుకే జడేజా, కృనాల్‌లకు అవకాశాలొచ్చాయి. ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నాక దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. జడేజా లేని లోటుని అతను తెలియనీయలేదు. అశ్విన్, జడేజా, అక్షర్‌ కలిసి ఆడితే చూడాలని ఉంది' అని శాస్త్రి తన మనసులో మాట చెప్పాడు.

కుదురుకునే సమయం ఇవ్వాలి:

కుదురుకునే సమయం ఇవ్వాలి:

'ప్రస్తుత జట్టు గెలవడాన్ని గర్వంగా భావిస్తోంది. ఒక్కోసారి ఓటములు ఎదురైనా.. దిగులు పడట్లేదు. మళ్లీ సానుకూల ఫలితం వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తోంది. ఆరు నెలలు ఆటగాళ్లు లాక్‌డౌన్‌లో గడిపిన సంగతి మాకు తెలుసు. అందుకే వారికి కుదురుకునే సమయం కావాలని అప్పుడే అనుకున్నాం. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత మూడో వన్డేలో విజయం అలానే వచ్చింది. ఈ గెలుపు తర్వాత భారత్ వెనక్కి తిరిగిచూడలేదు. టీ20లతో పాటు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడినా.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది' అని భారత కోచ్ చెప్పుకోచ్చాడు.

 అనుబంధం పెరిగింది:

అనుబంధం పెరిగింది:

'కోహ్లీసేన బయో బుడగలో చాలా కాలంగా ఉంటుంది. ఇందులో ఉన్నప్పుడు ఆటగాళ్లు బయటకు వెళ్లలేరు. కొన్ని అనుమతించిన స్థలాల్లోనే తిరగాలి. బస చేసిన గది నుంచి బయటకు వస్తే.. జట్టు కలుసుకునే చోటకే వెళ్లాలి. అంటే దీని వల్ల మ్యాచ్‌ అయిన తర్వాత కూడా క్రికెటర్లు ఎక్కువసార్లు కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కలవడం వల్ల ఆట గురించి చర్చ వస్తుంది. మా సమయంలో ఇలా మ్యాచ్‌ అయ్యాక కూడా ఎక్కువసేపు ఆట గురించి మాట్లాడుకునే వాళ్లం. బయో బుడగలో క్రికెట్‌ తప్ప వేరే ఆలోచనకు చోటే లేదు. వాళ్లకు అది తప్పనిసరి అయింది. అంతేకాదు క్రికెటర్ల మధ్య అనుబంధం పెరిగింది. ఒకరితో ఒకరు వ్యక్తిగత విషయాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం వల్ల బంధాలు బలపడ్డాయి' అని శాస్త్రి అంటున్నాడు.

పంత్ బ్యాటింగ్‌ చూస్తే.. సెహ్వాగ్‌ లెప్ట్ హ్యాండ్‌తో ఆడుతున్నాడా అనిపించింది: ఇంజమామ్‌

Story first published: Monday, March 8, 2021, 17:57 [IST]
Other articles published on Mar 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X