For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ బ్యాటింగ్‌ చూస్తే.. సెహ్వాగ్‌ లెప్ట్ హ్యాండ్‌తో ఆడుతున్నాడా అనిపించింది: ఇంజమామ్‌

Inzamam Ul Haq feels Rishabh Pant bating is like watching left handed Virender Sehwag
IND VS ENG : Rishabh Pant as Left Handed Virender Sehwag- Inzamam-Ul-Haq Hails || Oneindia Telugu

ఇస్లామాబాద్‌: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్‌ శైలి, భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేసిందన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఒత్తిడికి లోనుకాకుండా తనదైన శైలిలో బ్యాట్‌తో చెలరేగిపోవడంలో అచ్చం వీరూలానే ఉన్నడన్నాడు. పంత్‌ను చూసినప్పుడల్లా సెహ్వాగ్‌ లెప్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఇంజీ పేర్కొన్నాడు. ఇటీవలి కాలంలో పంత్ అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు.

ఫామ్‌లో పంత్:

ఫామ్‌లో పంత్:

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ టెస్ట్ డ్రాగా ముగించాడు. బ్రిస్బేన్ ‌టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ (101: 118 బంతుల్లో 13x4, 2x6) చేసి తన విలువేమిటో మరోసారి చాటి చెప్పాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 270 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

పంత్‌ బ్యాటింగ్‌ను ఆస్వాదించా:

పంత్‌ బ్యాటింగ్‌ను ఆస్వాదించా:

ఇంజమామ్ ఉల్‌ హక్‌ తన యూట్యూబ్‌ చానెల్లో ‌తాజాగా మాట్లాడుతూ... 'రిషబ్ పంత్‌ ప్రతిభావంతుడు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఒత్తిడి ఫీల్‌ అవ్వడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆటగాడిని చూశాను. 6 వికెట్లు పడిన సమయంలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అద్భుతమైన ఇన్నిండ్స్‌ ఆడాడు. పిచ్‌ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. బౌలర్‌ ఎవరన్న విషయం గురించి ఆలోచించలేదు. స్పిన్నర్లైనా, ఫాస్ట్‌ బౌలర్లు అయినా తను ఒకే విధంగా ఆడాడు. పంత్‌ బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఓ సమయంలో సెహ్వాగ్‌ ఎడమచేతితో బ్యాటింగ్‌ చేస్తున్నాడా అనిపించింది' అని అన్నాడు.

నేనింత వరకు చూడలేదు:

నేనింత వరకు చూడలేదు:

వీరేంద్ర సెహ్వాగ్‌తో తను ఆడిన మ్యాచ్‌ల గురించి ఇంజీ గుర్తుచేసుకున్నాడు. 'సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నపుడు వేరే ఇతర విషయాల గురించి అస్సలు పట్టించుకోడు. పిచ్‌ ఎలా ఉంది, బౌలర్‌ ఎవరు, బౌండరీల వద్ద ఫీల్డర్లు ఉన్నా సరే తను ఆడాలనుకున్న షాట్‌ను ఆడతాడు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ వీరూ శైలి ఇలాగే ఉంటుంది. అప్పట్లో సచిన్ టెండూల్కర్‌, రాహుల్ ద్రవిడ్‌ ఇప్పుడు విరాట్ కోహ్లీ‌, రోహిత్‌ శర్మ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎంతో మంది భారత్‌కు దొరికారు. అయితే సెహ్వాగ్‌ వంటి ఆత్మవిశ్వాసం ఉన్న క్రికెటర్‌ను నేనింత వరకు చూడలేదు' అని ఇంజమామ్ పేర్కొన్నాడు.

 ధోనీ కన్నా వేగంగా:

ధోనీ కన్నా వేగంగా:

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అరుదైన రికార్డు అందుకున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు! మేఘన్‌ మార్కెల్‌కు సెరెనా విలియ‌మ్స్ మ‌ద్ద‌తు!

Story first published: Monday, March 8, 2021, 17:17 [IST]
Other articles published on Mar 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+