న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శాస్త్రి స్థానాన్ని భర్తీ చేసేది వీళ్లే: టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఎవరెవరు?

Who Can Become Indian Cricket Team's Next Head Coach | Oneindia Telugu
 Ravi Shastris replacement: Former players who can become Indian cricket teams next head coach

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి కొత్తగా వయసుతో పాటు అనుభవాన్ని కొలమానంగా తీసుకోవాలంటూ ఐసీసీ కొత్త నిబంధనలను విధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ అందులో పేర్కొంది.

ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడానికి ముందు 2017, జులై నెలలో కోచ్‌ల ఎంపికకు బీసీసీఐ తొమ్మిది పాయింట్లతో కూడిన మార్గదర్శకాలు నిర్దేశించిన బీసీసీఐ ఈసారి మాత్రం మూడు మార్గదర్శకాలనే నిర్దేశించింది.

ప్రస్తుతం టీమిండియాకు కొనసాగుతున్న కోచింగ్‌ బృందం కూడా ఈ పదవుల ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూద్దాం...

టామ్ మూడీ

టామ్ మూడీ

టీమిండియా కోచ్‌ పదవికి పోటీ పడుతున్న వారిలో టామ్‌ మూడీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో కూడా టామ్ మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. టామ్ మూడీ గతంలో శ్రీలంక జట్టుతో పాటు వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. మూడీ కోచ్‌గా ఉన్న సమయంలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ పైనల్ వరకు చేరుకుంది. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండటంతో ఆయనకు భారత్‌లోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన కూడా ఉంది.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

2017లో రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైన సందర్భంలో కూడా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు కోచ్ రేసులో తెరపైకి వచ్చింది. సెహ్వాగ్‌ ఇంటర్యూకి కూడా హాజరయ్యాడు. అయితే, సెహ్వాగ్‌తో పోలిస్తే క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) రవిశాస్త్రి వైపే మొగ్గు చూపడం విశేషం. ఐపీఎల్ 2016 సీజన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వ్యవహారించారు. గత కొన్ని సంవత్సరాలుగా సెహ్వాగ్ క్రికెట్ పండిట్‌గా పలు ఛానల్స్‌లో విశ్లేషణలు చేస్తున్నారు.

ట్రెవర్ బేలిస్

ట్రెవర్ బేలిస్

ప్రస్తుతం ట్రెవర్ బేలిస్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగి పోతుంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో ట్రెవర్ బేలిస్ కీలకపాత్ర పోషించాడు. 2015 ప్రపంచకప్ తర్వాత నుంచి ఇంగ్లాండ్‌ను బెరుకులేని జట్టుగా తీర్చిదిద్దడంలో ట్రెవర్ బేలిస్ ముఖ్యభూమిక పోషించాడు.

మహిళా జయవర్దనే

మహిళా జయవర్దనే

క్రికెటర్‌గా 40 ఏళ్ల మహిళా జయవర్దనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక తరుపున 652 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జయవర్దనే 25,957 పరుగులు చేశాడు. అందులో 54 సెంచరీలు, 136 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్ పది, పన్నెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా అవతరించడంతో జయవర్దనే కీలకపాత్ర పోషించాడు.

Story first published: Wednesday, July 17, 2019, 14:33 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X