న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది! కోహ్లీ పుట్టినరోజు నాడు రవి శాస్త్రిని ట్రోల్ చేసిన అభిమానులు

Ravi Shastri Trolled By Fans With Hilarious Memes For Wishing Kohli || Oneindia Telugu
Ravi mama gonna party hard tonight: Fans troll Shastri on Virat Kohlis birthday

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని మరోసారి సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. మంగళవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో అతడికి రవిశాస్త్రి శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను రవిశాస్త్రి తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "హ్యాప్ బర్త్‌డే యంగ్‌మ్యాన్. బ్రేక్‌ను ఎంజాయ్ చేయి. రాబోయే రోజుల్లో అద్భుతంగా ఆడాలి. దేవుడు ఆశీర్వదించుగాక. #HappyBirthdayVirat #KingKohli" అంటూ ట్వీట్ చేశాడు.

డే/నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లు.. గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ!డే/నైట్‌ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లు.. గెస్ట్ కామెంటేటర్‌గా ధోనీ!

ఈ ట్వీట్‌కు రవిశాస్త్రిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ఒక నెటిజన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ట్యాగ్ చేస్తూ టీమిండియాకు తక్షణమే ఫిట్‌గా ఉంటే కోచ్ కావాలంటూ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే, రవి మామ ఈరోజు రాత్రి గట్టిగా పార్టీ చేసుకుంటావా? అంటూ రవిశాస్త్రి బీర్ తాగుతున్న ఫోటోని పోస్టు చేశాడు.

మరొక నెటిజన్ అయితే పార్టీ ప్రారంభమైందంటూ రవిశాస్త్రి కుడి చేతిలో బాటిల్‌ని ఎడమ చేతిలో గ్లాస్‌ను పట్టుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ఉమేశ్‌ యాదవ్‌, శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు బీసీసీఐ... శ్రీలంకపై విరాట్ కోహ్లీ తొలి వన్డే సెంచరీ వీడియోని అభిమానులతో పంచుకుంది. తన పుట్టినరోజుని జరుపుకునేందుకు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్‌ పర్యటనలో ఉన్నాడు. వరల్డ్ కప్ నుంచి విరామం లేకుండా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతోండటంతో పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

Story first published: Tuesday, November 5, 2019, 17:30 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X