న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా కొడుకు టీమిండియాకు ప్రపంచకప్‌ తీసుకొస్తాడని ఆశించా.. చాలా బాధేస్తోంది'

Ravi Bishnoi’s Family Disappointed After India Loses To Bangladesh In U19 World Cup Final

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): నా కొడుకు ప్రపంచకప్‌ తీసుకొస్తాడని ఆశించా. అలా జరగనప్పటికీ శాయశక్తులా ప్రయత్నించాడు అని టీమిండియా అండర్ 19 లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తండ్రి మంగీలాల్ బిష్ణోయ్ అన్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ ఆసాంతం విజయపరంపర సాగించిన యువ భారత్‌ జట్టు ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ చివరివరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తాం.. టీమిండియాకు కివీస్ కెప్టెన్ హెచ్చరిక!!వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తాం.. టీమిండియాకు కివీస్ కెప్టెన్ హెచ్చరిక!!

10 ఓవర్లు.. 30 పరుగులు.. నాలుగు వికెట్లు:

10 ఓవర్లు.. 30 పరుగులు.. నాలుగు వికెట్లు:

ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నా.. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. టీమిండియా నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించవచ్చనుకున్న బంగ్లా బ్యాట్స్‌మెన్స్‌కు తన అద్భుత బౌలింగ్‌తో ముచ్చెమటలు పట్టించాడు. రవి బిష్ణోయ్ బంగ్లా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన రవి 3 ఓవర్లు మేడిన్‌గా ముగించాడు.

ప్రపంచకప్‌ తీసుకొస్తాడని ఆశించా:

ప్రపంచకప్‌ తీసుకొస్తాడని ఆశించా:

రవి బిష్ణోయ్ తన కోటా 10 ఓవర్లలలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసాడు. బంగ్లా బ్యాబ్యాట్స్‌మన్‌ ఒకానొక దశలో షాట్ల ఆడడం పక్కన పెడితే.. రవి బౌలింగ్ చేసే గూగ్లీలు అర్థం తికమకపడ్డారు. సింగిల్స్ కోసం చాలా కష్టపడాల్సొచ్చింది. రవి ఇంతలా కష్టపడినా తన జట్టును మాత్రం గెలిపించలేకపొయాడు. మ్యాచ్ అనంతరం రవి తండ్రి మంగీలాల్ స్పందించాడు. 'నా కొడుకు ఇండియాకు ప్రపంచకప్‌ తీసుకొస్తాడని ఆశించా. అలా జరగనప్పటికీ శాయశక్తులా ప్రయత్నించాడు. టీమిండియా ఓడిపోవడంతో చాలా బాధగా ఉంది' అని తెలిపారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ మంగీలాల్ స్వస్థలం. అతను ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

 నిరాశ చెందాం:

నిరాశ చెందాం:

రవి బిష్ణోయ్ అన్నయ్య అశోక్ బిష్ణోయ్ మాట్లాడుతూ... 'రవి టోర్నమెంట్ అంతా మంచి ఆటతీరు కనబర్చడంతో కుటుంబం సంతోషంగా ఉంది. కానీ.. ఫైనల్‌లో రవి చేసిన ప్రదర్శన సరిపోకపోవడంతో అందరూ సంతృప్తిగా లేరు. ప్రపంచకప్‌లో నా సోదరుడు 17 వికెట్లు తీసాడు. ఫైనల్లో నాలుగు వికెట్లు నేలకూల్చాడు. అతను మాత్రమే కాదు మొత్తం జట్టు బాగా ఆడింది. కానీ భారత్ ఓడిపోవడంతో మేము నిరాశ చెందాం' అని చెప్పుకొచ్చాడు.

 టీమిండియా తరఫున రికార్డు:

టీమిండియా తరఫున రికార్డు:

ప్రపంచకప్‌లో రవి బిష్ణోయ్ టీమిండియా తరఫున ఓ రికార్డు సృష్టించాడు. 17 వికెట్లతో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. శాలభ్ శ్రీవాస్తవ (2000), అభిషేక్ శర్మ (2002), కుల్దీప్ యాదవ్ (2014), అనుకుల్ రాయ్ (2018) 15 వికెట్లు తీశారు. ఇక 2006లో పియూష్ చావ్లా, 2012లో సందీప్ శర్మ తర్వాత నాలుగు వికెట్లు తీసిన మూడవ భారతీయుడిగా బిష్ణోయ్ రికార్డుల్లోకి ఎక్కాడు.

Story first published: Monday, February 10, 2020, 15:25 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X