న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్ గురించే బాధపడుతున్నా: గంగూలీ

Ravi Ashwin is worrying me now: Sourav Ganguly on spinner’s recent injury woes

హైదరాబాద్: భారత జట్టు ఈ సంవత్సరం ఆఖరి టెస్టును రవిచంద్రన్ అశ్విన్ లేకుండా తలపడుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న టీమిండియా మెల్‌బౌర్న్ వేదికగా ఆడి సిరీస్‌లో ఆధిక్యం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, దురదృష్టవశాత్తు 2018 టెస్టు క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలోకి దిగింది. అడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరుగుతుండగానే అశ్విన్ గాయానికి గురైయ్యాడు. అదే బాధతో మ్యాచ్ ఐదో రోజు కూడా ఇబ్బందికి గురైయ్యాడు. ఆ తర్వాత పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టు జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. అశ్విన్ లేమితో జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది.

ఏడాది మిస్సయ్యింది 11వది

ఏడాది మిస్సయ్యింది 11వది

ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాలో స్పిన్నర్ అద్భుత ప్రదర్శన చేసిన నాథన్ లయన్ టీమిండియా ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడాది విదేశాల్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో అశ్విన్ మిస్సయ్యిన వాటిలో ఇది 11వది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆడిన టెస్టులో భారత్ నలుగురు ఫేసర్లు అవసరమైన నేపథ్యంలో అశ్విన్‌ను దూరంగా పెట్టింది. సౌతాంప్టన్ టెస్టులోనూ ఫిట్‌నెస్ లోపంతో బాధపడుతుండటంతో జట్టుకు దూరమైయ్యాడు.

అడిలైడ్‌లో అదరగొట్టిన అశ్విన్

అడిలైడ్‌లో అదరగొట్టిన అశ్విన్

అడిలైడ్ ప్రదర్శన తర్వాత ఆడిన మ్యాచ్‌లలో టీమిండియాలో అతని లోటు కనిపిస్తోంది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి తన సత్తా చాటాడు. మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్‌లను బోల్తా కొట్టించి 87 పరుగులకే నాలుగు వికెట్లను పడగొట్టి కట్టడి చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రవిచంద్రన్ అశ్విన్ ఆరోన్ ఫించ్, ఖవాజాలను ఓడించి భారత్‌ను ముందుకు నడిపాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆఖరి వికెట్‌ను తీసి భారత్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు.

అశ్విన్ గాయాలు బాధకు గురిచేశాయని

అశ్విన్ గాయాలు బాధకు గురిచేశాయని

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. రవిచంద్రన్ అశ్విన్ గాయాలు తనను బాధకు గురిచేశాయని తెలిపాడు. అశ్విన్ ఫిట్‌నెస్ తప్పక కాపాడుకోవాలి. వరుసగా గాయాలపాలవడం తనను నిరాశకు గురిచేసిందంటూ పేర్కొన్నాడు.

జట్టుకు అవసరమైనప్పుడే అశ్విన్ దూరం

జట్టుకు అవసరమైనప్పుడే అశ్విన్ దూరం

'రవిచంద్రన్ అశ్విన్ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ప్రముఖమైన టెస్టులకు అశ్విన్ హాజరుకాలేకపోతున్నాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జరిగింది. జట్టుకు ఇప్పుడు తన అవసరం ఎంతగానో ఉంది. కానీ, అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. తప్పిదాలను పునరావృతం చేయడం ఎంతమాత్రం మంచిది కాదు' అని గంగూలీ వెల్లడించాడు.

Story first published: Wednesday, December 26, 2018, 13:11 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X