న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ ఫొటో నా గుండె పగిలేలా చేసింది: వార్నర్‌కు రషీద్ ఖాన్ మద్దతు

By Nageshwara Rao
Rashid Khan: This picture broke my heart ,how can the cricket fans be so harsh

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో దోషిగా తేలి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అప్ఘన్ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయల్దేరిన వార్నర్‌ను సిడ్నీ విమానాశ్రయంలో అతని కుటుంబ సభ్యులు కలుసుకున్న విధానం చూస్తే తన గుండె పగిలిందని ట్వీట్‌ చేశాడు.

'ఈ ఫొటో నా గుండె పగిలేలా చేసింది. క్రికెట్‌ అభిమానులు ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరు పొరపాటు చేస్తారు. కానీ వారిలో కొంతమందే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరుతారు. ఈ చాంపియన్‌(వార్నర్‌)కు అండగా నిలబడి మద్దతివ్వండి. ప్రస్తుతం మన ప్రేమ, మద్దతు అతనికెంతో అవసరం' అని ట్వీట్‌ చేశాడు.

కన్నీళ్లతో ఆలింగనం

కన్నీళ్లతో ఆలింగనం

సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌కు డేవిడ్ వార్నర్‌ను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన అతడి భార్య కాండిస్‌ను కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో వార్నర్ కళ్లలో పశ్చాతపం కనిపించింది. ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలను ఎత్తుకోగానే అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఆ ఇద్దరు చిన్నారులు తండ్రిని చూసి ఏడ్వడం మొదలుపెట్టారు.

వార్నర్ పట్ల ప్రతి ఒక్కరూ తమ సానుభూతి

వార్నర్ పట్ల ప్రతి ఒక్కరూ తమ సానుభూతి

ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్నర్ పట్ల ప్రతి ఒక్కరూ తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాను తప్పు చేశాననే బాధ కంటే తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాననే మానసిక క్షోభ వార్నర్‌ను మరింత వేధనకు గురి చేసింది.

ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడలేమో

బాల్ టాంపరింగ్ ఘటనపై శనివారం మీడియా ముందుకు వచ్చిన వార్నర్ జీవితంలో తానెప్పటికీ ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడలేమోనని బాధపడ్డాడు. ‘క్రికెట్‌ అభిమానులను, నేను క్రికెటర్‌గా స్థిరపడేందుకు ప్రోత్సహించిన వారందరినీ ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాను. ఓ తప్పు కారణంగా జట్టులో స్థానం కోల్పోయాను. నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను' అని అన్నాడు.

 మీ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తా

మీ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తా

'నాపై మీ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాను. కేప్‌టౌన్‌ టెస్టులో మూడో రోజు చోటు చేసుకున్న పరిణామాలకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. జట్టులోని మిగతా ఆటగాళ్లకు, సిబ్బంది, దక్షిణాఫ్రికా అభిమాలనుకు కూడా ఈ సందర్భంగా నేను క్షమాపణలు తెలుపుతున్నాను. సఫారీ గడ్డపై నేను క్రికెట్‌కు మచ్చ తెచ్చాను. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నాను' అని తెలిపాడు.

 నన్ను క్షమించమని కోరుతున్నా

నన్ను క్షమించమని కోరుతున్నా

'నాకు మాత్రం నేను తిరిగి ఆస్ట్రేలియా తరఫున ఆడతానన్న నమ్మకం లేదు' అని వార్నర్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ‘నా భార్య కాండీస్‌, పిల్లల్ని కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. మీరు లేకపోతే నేను లేను. ఇలాంటి పనులు నేను భవిష్యత్తులో మళ్లీ చేయను అని ప్రామిస్‌ చేస్తున్నాను' అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, March 31, 2018, 18:11 [IST]
Other articles published on Mar 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X