న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబోయ్ హార్దిక్‌ పాండ్యానా.. పొట్టి ఫార్మాట్‌లో చాలా డేంజర్: స్టార్ బౌలర్

Rashid Khan reveals the three deadliest batsmen in cricket world
Hardik Pandya Needs To Work Harder Says Abdul Razzaq | Oneindia Telugu

కాబూల్‌: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా డేంజర్ బ్యాట్స్‌మెన్ అని అఫ్గానిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ అంటున్నాడు. టీ20ల్లో హార్దిక్‌ జోరును ఆపడం చాలా కష్టమన్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లతో పాటు హార్దిక్ పాండ్యాకి బౌలింగ్ చేయడం చాలా కష్టమని రషీద్ తెలిపాడు. ఐపీఎల్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌లను సైతం అలవోకగా బోల్తా కొట్టించే రషీద్.. ఆండ్రీ రసెల్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలను మాత్రం ఆపలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఆడుతున్న విషయం తెలిసిందే.

క్రికెట్‌ను ఎంతో మిస్సవుతున్నా.. బంతిని బలంగా బాదడం కోసం ఎదురు చూస్తున్నా: రోహిత్క్రికెట్‌ను ఎంతో మిస్సవుతున్నా.. బంతిని బలంగా బాదడం కోసం ఎదురు చూస్తున్నా: రోహిత్

హార్దిక్ చాలా డేంజర్:

హార్దిక్ చాలా డేంజర్:

తాజాగా రషీద్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'టీ20ల్లో వెస్టిండీస్ క్రికెటర్లకి బౌలింగ్ చేయాలంటే చాలా కష్టం. వాళ్లు చాలా ప్రమాదకర ఆటగాళ్లు. బంతిని బలంగా బాదుతారు. వాళ్లు బంతిని సరిగా హిట్ చేయకపోయినా.. అది బౌండరీకి వెళ్లిపోతుంటుంది. విండీస్ హిట్టర్ల తరహాలోనే హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేస్తుంటాడు. టీ20ల్లో వీళ్లు చాలా ప్రమాదకరం' అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్ చేసిన రషీద్.. రసెల్, పొలార్డ్, పాండ్యాలకు మాత్రం భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇంజమాముల్‌ అండగా నిలిచాడు:

ఇంజమాముల్‌ అండగా నిలిచాడు:

'అఫ్గానిస్థాన్ జట్టుకు పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు ఇంజమాముల్‌ హక్‌ కోచ్‌గా పని చేసిన సమయంలో నాకు ఎక్కువ అండగా నిలిచాడు. నన్ను కేవలం టీ20 బౌలర్‌గా మాత్రమే ముద్ర వేసిన సమయంలో ఇంజీ నాపై నమ్మకం ఉంచాడు. టీ20 స్పెషలిస్టుగా ముద్ర వేయడంతో అసంతృప్తి ఉండేదని ఇంజీతో చెబితే.. వాటిని పట్టించుకోవద్దన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టులో కచ్చితంగా ఉంటావనే హామీ ఇచ్చాడు .అలా నా కెరీర్‌ ఎదుగుదలకు ఇంజీ సహకరించాడు. నేను అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతానని నమ్మకం ఇంజీలో ఉండేది. అదే ఈరోజు నన్ను నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌గా నిలబెట్టింది' అని రషీద్ తెలిపాడు.

నా తల్లి క్రికెట్‌కు పెద్ద అభిమాని

నా తల్లి క్రికెట్‌కు పెద్ద అభిమాని

'నా తల్లి క్రికెట్‌కు పెద్ద అభిమాని. నేను క్రికెట్‌ ఆడుతున్న నాటి నుంచి అమ్మ ఈ గేమ్‌కు ఫ్యాన్‌గా మారిపోయారు. ప్రస్తుతం క్రికెట్‌ ఈవెంట్‌లు ఏమీ జరగకపోవడంతో అ‍మ్మ బోర్‌ ఫీలవుతుంది. ఇంటిని క్రికెట్‌ స్టేడియంగా మార్చేసి ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఇంటిలో లెగ్‌ స్పిన్‌ వేయడానికి సరిపోయే స్థలం ఉంది. ప్రస్తుతం మా ఇంట్లో ఉన్న సోదరులు, ఇతర బంధువులతో కలిసి రెండు జట్లుగా విడిపోయి క్రికెట్‌ గేమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా. దీంతో నా బాల్యం గుర్తుకువస్తుంది' అని రషీద్ చెప్పుకొచ్చాడు.

 2015లో అంతర్జాతీయ అరంగేట్రం:

2015లో అంతర్జాతీయ అరంగేట్రం:

2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్ ఇప్పటి వరకూ 48 టీ20 మ్యాచ్‌లాడి 89 వికెట్లు తీసాడు. 70 వన్డేల్లో 133 వికెట్లు తీసిన ఈ స్టార్ స్పిన్నర్.. 4 టెస్టుల్లో 23 వికెట్లని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఇప్పటి వరకూ 46 మ్యాచ్‌లాడి 55 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, May 2, 2020, 17:26 [IST]
Other articles published on May 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X