న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్‌పై రషీద్ ఖాన్..నైట్‌రైడర్స్‌పై కుల్‌దీప్: పాత ఫ్రాంఛైజీలపై పగబట్టిన స్పిన్నర్లు

Rashid Khan And Kuldeep Yadav Takes Revenge On There Former Teams SRH and KKR
First sunrise of 2021 in India mesmerises all: Watch | Oneindia News

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మరో మ్యాచ్‌లో ఓడింది. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇది వరుసగా అయిదో ఓటమి. ఆరంభంలో కనపరిచిన దూకుడును కోల్పోయింది. కేకేఆర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. గురువారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారిందీ జట్టు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది.

 ప్లే ఆఫ్ ఆశలు ఇంకా ఉన్నాయా?

ప్లే ఆఫ్ ఆశలు ఇంకా ఉన్నాయా?

ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది ముచ్చటగా మూడే. ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకో అయిదు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందీ జట్టు. తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒక్కొక్క మ్యాచ్‌ను ఆడుతుంది. ఆయా మ్యాచ్‌లన్నీ అగ్నిపరీక్షల్లాంటివే.. కీలకమైనవే.

పగ తీర్చుకున్న కుల్‌దీప్ యాదవ్..

పగ తీర్చుకున్న కుల్‌దీప్ యాదవ్..

ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. మెగా వేలం పాట సందర్భంగా రెండు కోట్ల రూపాయలకు అతణ్ని జట్టులోకి తీసుకుంది ఢిల్లీ కేపిటల్స్. ఇదివరకు సుదీర్ఘకాలం పాటు అతను కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున ఆడాడు. తన బౌలింగ్‌ మేజిక్‌తో జట్టును గెలిపించన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ- అతన్ని వదులుకుంది కోల్‌కత ఫ్రాంఛైజీ. భుజానికి గాయం, శస్త్ర చికిత్స వల్ల అటు టీమిండియాలోనూ అతను చోటు కోల్పోయాడు.

అనేక అనుమానాల మధ్య..

అనేక అనుమానాల మధ్య..

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య- ఈ ఐపీఎల్‌లో అమ్ముడుపోతాడో లేదోననుకునే దశలో ఢిల్లీ కేపిటల్స్ కుల్‌దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన అతను 17 వికెట్లు పడగొట్టాడంటే అతని ఫామ్ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ఇదే.

 కోల్‌కతపై పగబట్టిన కుల్‌దీప్..

కోల్‌కతపై పగబట్టిన కుల్‌దీప్..

ప్రత్యేకించి తన పాత ఫ్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్‌పై కుల్‌దీప్ యాదవ్ పగబట్టినట్టే కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ రెండుసార్లు కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టగా.. ఈ రెండుసార్లు కూడా కుల్‌దీప్ యాదవ్ చెలరేగాడు. ఈ రెండింట్లోనూ నాలుగు చొప్పున వికెట్లు నేలకూల్చాడు. ఆ జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చిన నాలుగు వికెట్లు తీసుకోగా.. ఈ సారి 14 పరుగులకు మళ్లీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

రషీద్ ఖాన్ కూడా అంతే..

రషీద్ ఖాన్ కూడా అంతే..

అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ రషీద్ ఖాన్‌ది కూడా ఇదే పరిస్థితి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతణ్ని వదులుకోవడంతో గుజరాత్ టైటాన్స్‌ కొనుగోలు చేసింది. ఆ టీమ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను ఈ ఆఫ్ఘన్ ప్లేయరే లీడ్ చేస్తోన్నాడు. సన్‌రైజర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్నతన జట్టును బ్యాటింగ్‌తో గెలిపించాడు రషీద్ ఖాన్. చివరి ఓవర్‌లో 22 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు సిక్సర్లను బాది మరీ తన పాత ఫ్రాంఛైజీని ఓడించి, పగ తీర్చుకున్నాడు.

Story first published: Friday, April 29, 2022, 11:44 [IST]
Other articles published on Apr 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X