న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గబ్బర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. ఘనంగా పునరాగమనం!!

Ranji Trophy: Shikhar Dhawan hits unbeaten 137, steers Delhi out of trouble

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్‌, ఢిల్లీ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ రంజీ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగాడు. 15 నెలల తర్వాత తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న గబ్బర్‌.. హైదరాబాద్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. తన మార్క్‌ డ్రైవ్‌లతో, బాక్స్‌ క్రికెట్‌ టెక్నిక్‌తో హైదరాబాద్‌పై రెచ్చిపోయి (198 బంతుల్లో 137 బ్యాటింగ్‌; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేసాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

'కోహ్లీకి అవకాశాలెన్నో.. టీమిండియా జైత్రయాత్రకు కారణం అదే''కోహ్లీకి అవకాశాలెన్నో.. టీమిండియా జైత్రయాత్రకు కారణం అదే'

చెలరేగిన సిరాజ్‌:

చెలరేగిన సిరాజ్‌:

రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఏలో భాగంగా ఢిల్లోలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో హైదరాబాద్‌-ఢిల్లీ జట్ల మధ్య బుధవారం మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ ఆరంభంలో అదరగొట్టింది. పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌ (2/60) ఆరంభంలోనే కునాల్‌ చండేలా (1), ధృవ్‌ షోరే (0)ను బోల్తా కొట్టించాడు. 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీని ధావన్‌ ఆదుకున్నాడు.

గబ్బర్‌ సెంచరీ:

గబ్బర్‌ సెంచరీ:

ధావన్ స్వింగ్‌ అవుతున్న బంతులను కూడా బౌండరీలు దాటించాడు. అయితే స్పిన్నర్‌ మెహదీ హసన్‌ (3/61) జాంటీ సిద్ధు (15), లలిత్‌ యాదవ్‌ (19)ను వెనక్కి పంపడంతో ఢిల్లీ 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయినా ధావన్ దూకుడు మాత్రం తగ్గలేదు. అంజు రావత్‌ (29) సహకరించడంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రావత్‌ ఔటైన తర్వాత కున్వర్‌ బిందూరీ (22) శిఖర్‌కు అండగా నిలిచాడు.

భారీ స్కోర్ దిశగా ఢిల్లీ:

భారీ స్కోర్ దిశగా ఢిల్లీ:

ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 84 పరుగులు జోడించిన ధావన్‌.. ఏడో వికెట్‌కు కున్వర్‌తో 57 పరుగులు జతచేశాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ (137), బధూరీ (22) ఉన్నాడు. మెహదీ హసన్‌ 3, మహ్మద్‌ సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. భారీ స్కోర్ దిశగా ఢిల్లీ సాగుతోంది.

రహానే, పృథ్వీ షా విఫలం:

రహానే, పృథ్వీ షా విఫలం:

టీమిండియా ఆటగాళ్లు అంజిక్య రహానే (5), పృథ్వీ షా (12) విఫలమవడంతో రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి రోజే ముంబై 114 పరుగులకు ఆలౌట్ అయింది. రైల్వేస్‌ జట్టులో పేసర్‌ టి ప్రదీప్‌ (6/37) ఆరు వికెట్లతో చెలరేగాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (39) టాప్ స్కోరర్. అనంతరం ముంబై బౌలర్‌ దీపక్‌ శెట్టి (3/20) అదరగొట్టడంతో 116 పరుగులకే రైల్వేస్‌ ఐదు వికెట్లు కోల్పోయి తొలి రోజును ముగించింది.

రామన్‌ సెంచరీ:

రామన్‌ సెంచరీ:

ఓపెనర్‌ అభిషేక్‌ రామన్‌ (255 బంతుల్లో 110 బ్యాటింగ్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీ సాధించడంతో.. ఆంధ్రతో బుధవారం మొదలైన రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో బెంగాల్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట నిలిచే సమయానికి బెంగాల్‌ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కౌశిక్‌ ఘోష్‌ (37; 5 ఫోర్లు), మనోజ్‌ తివారీ (46; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఆంధ్ర బౌలర్ స్టీఫెన్‌ 2 వికెట్లు తీసాడు.

Story first published: Thursday, December 26, 2019, 8:40 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X