న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంఫైర్‌పైకి దూసుకుపోయిన మురళీ విజయ్: మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా!

Ranji Trophy: Murali Vijay fined for showing dissent over umpire decision


హైదరాబాద్: మైదానంలో అంఫైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన టీమిండియా టెస్టు ఓపెనర్ మురళీ విజయ్‌కు జరిమానా విధించారు. రంజీ ట్రోఫీలో భాగంగా మంగళవారం తమిళనాడులోని దిండిగల్ వేదికగా కర్ణాటక, తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో మురళీ విజయ్ దూకుడుగా వ్యవహరించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు తమిళనాడు టీమ్‌ మేనేజ్‌మెంట్ తెలిపింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ పవన్ వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు.

సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రోజున: సెంచరీతో గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టిన సచిన్సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రోజున: సెంచరీతో గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టిన సచిన్

ఫీల్డర్లతో పాటు అశ్విన్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితిన్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మురళీ విజయ్ నోటికి పనిచెప్పాడు. కెప్టెన్ విజయ్ శంకర్‌తో పాటు ఫీల్డర్లు కూడా పిచ్ మధ్యలోకి రాగా, బౌలర్ అశ్విన్‌కి అంపైర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో అంఫైర్ పట్ల మురళీ విజయ్ పరుష పదజాలం ప్రయోగించాడు. దీంతో బీసీసీఐ క్రమశిక్షణ ఉల్లంఘన కింద మురళీ విజయ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 336 పరుగులకి ఆలౌటైంది.

ఇంటర్నెట్ మనసు గెలిచిన ఫోటో: గేమ్ మధ్యలో బిడ్డకు పాలిచ్చిన వాలీబాల్ ప్లేయర్ఇంటర్నెట్ మనసు గెలిచిన ఫోటో: గేమ్ మధ్యలో బిడ్డకు పాలిచ్చిన వాలీబాల్ ప్లేయర్

కర్ణాటక జట్టులో దేవదత్ పడిక్కల్(78), పవన్ దేశ్ పాండే(65), గౌతమ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తమిళనాడు 55 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసంది. ప్రస్తుతం దినేశ్ కార్తీక్(21), జగదీషన్(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత జట్టులోకి 2008లో అరంగేట్రం చేసిన మురళీ విజయ్ గతేడాది డిసెంబరులో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మురళీ విజయ్ స్థానంలో చోటు దక్కించుకున్న పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు సత్తా చాటడంతో టెస్టు జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. ఇటీవలే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరిస్‌ల్లో మయాంక్ అగర్వాల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

Story first published: Tuesday, December 10, 2019, 16:03 [IST]
Other articles published on Dec 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X