న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేసర్ల కోసం బిజినెస్ క్లాస్ సీట్లు వదులుకున్న ద్రావిడ్, రోహిత్, కోహ్లీ!

Rahul Dravid, Rohit Sharma, Virat Kohli Sacrifice their Business class seats

టీ20 ప్రంచకప్‌లో భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్‌లో ఆడుతోంది. ఒక్క వేదికలో కూడా వరుసగా రెండు మ్యాచులు ఆడలేదీ జట్టు. పెర్త్, మెల్‌బోర్న్, సిడ్నీ.. ఇలా ఒక్కో మ్యాచ్ పూర్తవగానే మరో ప్రాంతానికి ప్రయాణం అవుతోంది. ఈ ఎడతెరిపిలేని సుదూర ప్రయాణాల వల్ల ఆటగాళ్లు అలసిపోవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, వెటరన్ స్టార్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం వైరల్ అవుతోంది.

భారత పేసర్ల హవా..

భారత పేసర్ల హవా..

ప్రస్తుతం జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో భారత పేస్ దళం ఎవరూ ఊహించని విధంగా రాణిస్తోంది. కొత్త బంతితో అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తుంటే.. హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ ఆ తర్వాత వాళ్ల పనిపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అర్షదీప్ సింగ్ 10, పాండ్యా 8, షమీ 6, భువీ 4 వికెట్లు తీసుకున్నారు.

ఐసీసీ సీట్ల కేటాయింపు ఇలా..

ఐసీసీ సీట్ల కేటాయింపు ఇలా..

బిజీ బిజీ షెడ్యూల్‌ ఉన్న టీ20 ప్రపంచకప్‌ నిర్వహణలో భాగంగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో విమాన టికెట్ల విషయం కూడా ఒకటి. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి జట్టుకు కేవలం నాలుగు మాత్రమే బిజినెస్ క్లాస్ సీట్లు కేటాయిస్తారు. ఐసీసీ కోటాలో లభించే బిజినెస్ క్లాస్ సీట్లను సాధారణంగా కోచ్, కెప్టెన్, మేనేజర్, సీనియర్ ప్లేయర్‌కు కేటాయిస్తారు. మొత్తం 16 జట్లకు ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

ద్రావిడ్, రోహిత్, విరాట్ డెసిషన్

ద్రావిడ్, రోహిత్, విరాట్ డెసిషన్

అయితే బిజీ షెడ్యూల్‌లో ఎక్కువగా ఇబ్బంది పడేది పేసర్లేనని టీమిండియా భావించింది. అందుకే రాహుల్, రోహిత్, కోహ్లీ తమ బిజినెస్ క్లాస్ సీట్లను ఫాస్ట్ బౌలర్లకు ఇచ్చేశారు. మైదానంలో ఎక్కువగా అలసిపోయే పేసర్లకు మరింత లెగ్ స్పేస్ దొరకడం మంచిదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా ఈ సీట్లను ఉపయోగించుకుంటున్నారు.

Story first published: Tuesday, November 8, 2022, 10:10 [IST]
Other articles published on Nov 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X