హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన చేజార్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడటంతో టీమిండియా మరో టెస్టు మిగిలుండగానే సిరిస్‌ని 1-3తో చేజార్చుకుంది.
కోహ్లీ మళ్లీ టాస్ ఓడాడు: హనుమ విహారి అరంగేట్రం, ఇంగ్లాండ్ బ్యాటింగ్
ఐదో టెస్టు ప్రారంభానికి ముందు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే మాట్లాడుతూ "భారత జట్టు ఈ సిరీస్‌లో బాగా ఆడింది. కానీ, ఇంగ్లాండ్ జట్టు మాకంటే మెరుగ్గా ఆడింది. టెస్టుల్లో ప్రతి సెషన్‌లోనూ 100 శాతంపైనే జట్టు కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. బౌలింగ్ విభాగం. సిరీస్‌లో భారత బౌలర్ల కంటే.. ఇంగ్లాండ్ బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారు" అని అన్నాడు.
"టెస్టు క్రికెట్ ఆడేటప్పుడు.. ఆటగాళ్లకి ఎక్కువ సహనం ఉండాలి. బ్యాట్స్‌మెన్‌కి అయితే బంతుల్ని విడిచిపెట్టే సహనం.. బౌలర్లకి ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు విసిరే ఓపిక ఉండాలి. ఈ టెక్నిక్‌తోనే ఇంగ్లాండ్ సఫలమైంది" అని రహానే వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓటమి పట్ల తీవ్ర బాధ: ఇనిస్టాగ్రామ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడి
ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి అరంగేట్రం చేశాడు. విహారికి ఇదే తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయర్ విహారి. జట్టులో కరుణ్ నాయర్ రూపంలో మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఉన్నప్పటికీ, అతడిని కాదని విహారికి తుది జట్టులో చోటు కల్పించారు.
అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్‌ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం సౌతాంప్టన్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్‌కు ఇదే చివరి టెస్టు. ఈ మ్యాచ్ తర్వాత అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు.