న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మురళీధరన్‌కి ధోనీ చుక్కలు చూపించాడు.. 6 బంతులు స్టేడియం బయటే: అశ్విన్

R Ashwin says MS Dhoni of today is a lot calculated but he used to whack every ball in past

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ సారథి ఎంఎస్ ధోనీ శ్రీలంక క్రికెట్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు చుక్కలు చూపించాడని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌ సందర్భంగా.. మురళీధరన్ విసిరిన ఓ ఆరు బంతులు ధోనీ హిట్టింగ్ దెబ్బకి చెన్నైలోని చెపాక్ స్టేడియం పైకప్పుని తాకినట్లు అశ్విన్ చెప్పాడు. మహీ సిక్స్ కొట్టిన ప్రతిసారి మురళీధరన్ బాల్ లెంగ్త్‌ని మార్చినా ప్రయోజనం లేకపోయిందని వెటరన్ స్పిన్నర్ పేర్కొన్నాడు.

ఆరు బంతులు స్టేడియం బయటే

ఆరు బంతులు స్టేడియం బయటే

తాజాగా క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో హర్ష భోగ్లేతో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ... 'అది 2008 ఐపీఎల్ సీజన్. చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా బ్యాటింగ్ చేస్తున్నారు. వారికి బౌలింగ్ చేసేందుకు మేమంతా క్యూలో నిలబడ్డాం. మ్యాచ్‌కి వినియోగించే పిచ్ పక్కనే ఆ నెట్ సెషన్ జరుగుతోంది. సెంటర్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి మురళీధరన్ బౌలింగ్ చేసాడు. మురళీ వేసిన ప్రతి బంతిని ధోనీ భారీ షాట్ ఆడి స్టాండ్స్‌లోకి తరలించాడు. ఆరోజు ఓ ఆరు బంతులు స్టేడియం పైకప్పుని తాకినట్లు ఇంకా గుర్తుంది' అని చెప్పాడు.

ధోనీలా ఎవరూ హిట్టింగ్ చేయడాన్ని చూడలేదు

ధోనీలా ఎవరూ హిట్టింగ్ చేయడాన్ని చూడలేదు

కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక ఎంఎస్ ధోనీ తన బ్యాటింగ్ వేగం తగ్గించాడు. ఇప్పుడు ధోనీ కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ అప్పట్లో ధోనీలా ఎవరూ హిట్టింగ్ చేయడాన్ని నేను చూడలేదు. చిదంబరం స్టేడియంలో బంతిని అలా బాదడాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఆ సమయంలో అది గొప్ప విషయం' అని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మురళీధరన్ బౌలింగ్ చేస్తుండటంతోనే యువరాజ్ సింగ్‌కి బదులుగా ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడు. ఐపీఎల్‌ ప్రాక్టీస్ సెషన్‌లో మురళీధరన్‌ బౌలింగ్‌ని ఎదుర్కొన్న అనుభవం ఉండటంతోనే మహీ బ్యాటింగ్ ఆర్డర్‌‌లో ముందుకు వెళ్ళాడు.

350 వన్డేలు.. 10,773 పరుగులు

350 వన్డేలు.. 10,773 పరుగులు

కెరీర్‌లో తొలి నాళ్లలో మిడిలార్డర్‌లో ఆడిన ఎంఎస్ ధోనీ.. ఆ తర్వాత నెం.3కి మారాడు. ఆ స్థానంలో 17 మ్యాచ్‌లాడిన మహీ.. 82.75 సగటుతో 993 పరుగులు చేశాడు. శ్రీలంకపై 2005లో 183 పరుగుల భారీ స్కోరు నెం.3లోనే నమోదు చేసాడు. పాకిస్థాన్‌పై విశాఖపట్నంలో 148 పరుగులు నెం.3లో వచ్చాయి. అయితే 2007లో కెప్టెన్‌గా మారిన తర్వాత ఫినిషర్ బాధ్యతని తీసుకున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా నెం.5 లేదా నెం.6లో ఆడుతూ వచ్చాడు. ఎంఎస్ ధోనీ మొత్తంగా 350 వన్డే మ్యాచ్‌ల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, 73 అర్ధ శతకాలు ఉన్నాయి.

వన్డే ప్రపంచకప్ తర్వాత దూరం

వన్డే ప్రపంచకప్ తర్వాత దూరం

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.

క్రికెట్‌పై విరక్తితో 2008లోనే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు: కిర్‌స్టన్

Story first published: Wednesday, June 17, 2020, 16:30 [IST]
Other articles published on Jun 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X