న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: 'గుండె బద్దలైంది.. త్వరలోనే మళ్లీ వస్తాను! అప్పటి వరకు ఈ ఫొటోను చూసుకుంటా!

Punjab Kings batsman Nicholas Pooran says Suspension Of IPL 2021 is Heart breaking
IPL 2021 : Nicholas Pooran డక్ ఔట్ లని షేర్ చేస్తూ.. పూరన్ ఎమోషనల్ || Oneindia Telugu

ఆంటిగ్వా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను నిరవధిక వాయిదాతో తన గుండె బద్దలైందని పంజాబ్‌ కింగ్స్‌ హార్డ్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను వాయిదా చేయడమే సరైన నిర్ణయమని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)పై ప్రశంసలు కురిపించాడు. వైఫల్యాలను అధిగమించి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఫాంలోకి వస్తానని పూరన్‌ ధీమా వ్యక్తం చేశాడు. కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి కరోనా సోకడంతో మెగా టోర్నీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించింది.

గుండె బద్దలైంది

ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే తమతమ ఇళ్లకు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఇంటికి చేరుకున్నారు. ఇక వెస్టిండీస్ ప్లేయర్స్ సైతం స్వదేశాలకు పయనమయ్యారు. ఈ సందర్బంగా నికోలస్‌ పూరన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. 'ఐపీఎల్ వాయిదా వేయడం, అందుకు గల కారణాలు గుండెలు బద్దలు చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇలా చేయడమే సరైనది. త్వరలోనే మళ్లీ వస్తాను ఐపీఎల్‌. అప్పటి వరకు ఈ ఫొటోను చూసుకుంటాను. రెట్టింపు శక్తితో తిరిగి వస్తాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి' అని ట్వీట్ చేశాడు.

ఆరు మ్యాచ్‌లలో నాలుగు డకౌట్‌లు

ఆరు మ్యాచ్‌లలో నాలుగు డకౌట్‌లు

ఐపీఎల్‌ 2021లో పంజాబ్‌ కింగ్స్ తరఫున బరిలో దిగిన విండీస్‌ క్రికెటర్‌ నికోలస్‌ పూరన్‌ అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లలో నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్తాన్‌, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో జరిగిన పంజాబ్‌ మ్యాచ్‌లో ఈ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధికసార్లు డకౌట్‌గా ఔటైన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఢిల్లీతో ఆడిన మ్యాచ్‌లో 9, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో చివరి మ్యాచులో అతనిపై వేటు పడింది. అందుకే రెట్టింపు శక్తితో తిరిగి వస్తాను అని ట్వీట్ చేశాడు.

జూన్‌లో డివిలియర్స్ రీఎంట్రీ.. ఏబీ ఒక్కడే కాదు! వెస్టిండీస్‌ పర్యటనకు జట్టు ఎంపిక నేడే!

వంతు ఆర్థిక సాయం చేస్తా

వంతు ఆర్థిక సాయం చేస్తా

కరోనా మహమ్మారితో బాధపడుతున్న దేశ ప్రజలకు సాయం చేసేందుకు క్రీడా ప్రపంచం ముందుకువస్తోంది. ఈ క్రమంలోనే నికోలస్‌ పూరన్‌ కూడా విరాళం ప్రకటించాడు. కరోనాతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత దేశానికి ఈ సారి తన ఐపీఎల్‌ వేతనంలో కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా పూరన్‌ ప్రకటించాడు. 'ఇప్పటికీ అనేక దేశాలు కరోనాతో పోరాడుతూనే ఉన్నాయి. భారత దేశం పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ భయనకమైన స్థితి నుంచి భారత్ బయటపడటానికి నా వంతు ఆర్థిక సాయం చేస్తా' అని పూరన్‌ ఇటీవలే ట్వీట్‌ చేశాడు.

Story first published: Friday, May 7, 2021, 16:18 [IST]
Other articles published on May 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X