న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీళ్లు తాగకపోతే ఎలా.., వాళ్లను చూస్తే గర్వంగా ఉంది: కోహ్లీ

India vs West indies 2018 : Kohli Prefers Water Gaps As Per Conditions
Prithvi Shaw showed he is different quality: Virat Kohli

రాజ్‌కోట్‌: యువ సంచలనం పృథ్వీషా ప్రత్యేక ఆటగాడని అందుకే త్వరగా టీమిండియాలోకి వచ్చేశాడని కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. అతడిపై ప్రశంసలు కురిపించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన చిన్న వయస్కుడిగా షా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అరంగ్రేట మ్యాచ్‌లోనే 99 బంతులకే సెంచరీ సాధించి తొలి ఇన్నింగ్స్‌లోనే రికార్డులను సొంతం చేసుకున్నాడు.

పృథ్వీషా, జడ్డూలను చూస్తే గర్వంగా

పృథ్వీషా, జడ్డూలను చూస్తే గర్వంగా

‘పృథ్వీషా, జడ్డూ ప్రదర్శనలు చూస్తే గర్వంగా అనిపిస్తోంది. తొలి మ్యాచ్‌ ఆడుతున్నా అతడు (షా) తనలోని ప్రత్యేక ఆటతీరుతో ఆధిపత్యం చలాయించాడు. అందుకే అతడు టెస్టు జట్టులోకి త్వరగా దూసుకొచ్చాడు. ఒక కెప్టెన్ దృక్కోణంలో అతడిని చూస్తుంటే చాలా బాగుంది'అని విండీస్‌పై గెలిచిన తర్వాత కోహ్లీ అన్నాడు.

 అతడు మూడంకెల స్కోరు అందుకోవాలని

అతడు మూడంకెల స్కోరు అందుకోవాలని

‘జడ్డూ సైతం అంతే. చాలా కీలక పరుగులు చేశాడు. అతడు మూడంకెల స్కోరు అందుకోవాలని మేమంతా కోరుకున్నాం. అతడు మ్యాచ్‌లను మలుపు తిప్పగలడని మా నమ్మకం. తొలి ఇన్నింగ్స్‌లో షమి, ఉమేశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పిచ్ ‌నుంచి ఎలాంటి సహకారం అందకున్నా వికెట్లు తీశారు'అని కోహ్లీ వెల్లడించాడు.

 నీరు తాగరాదన్న కొత్త నిబంధన చూపించి

నీరు తాగరాదన్న కొత్త నిబంధన చూపించి

తమ ఓవర్‌రేట్‌ మెరుగ్గా ఉండటానికి బాధ్యత అంపైర్లదే అని విరాట్‌ తెలిపాడు. ‘నీరు తాగరాదన్న కొత్త నిబంధన చూపించి అంపైర్లు మమ్మల్ని వేగంగా బంతులు వేసేలా చేశారు. దీంతో బౌలర్లు ఇబ్బందులు పడ్డారు. నీరు తాగకుండా 45 నిమిషాలు బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. పరిస్థితులను బట్టి నిబంధనలు మారుస్తారనే అనుకుంటున్నా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

తొలి టెస్టులో 272 పరుగుల తేడాతో చిత్తుగా

తొలి టెస్టులో 272 పరుగుల తేడాతో చిత్తుగా

ఎప్పట్లాగే టీమిండియా సొంతగడ్డపై చెలరేగిపోయింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారీ విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మూడో రోజు, శనివారం 94/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌.. 181 పరుగులకే కుప్పకూలింది. తర్వాత ఫాలోఆన్‌ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ పోరాట పటిమ చూపలేదు. 196 పరుగులకే చేతులెత్తేసింది.

1
44264
Story first published: Sunday, October 7, 2018, 9:49 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X