న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ టూర్‌కు వన్డే జట్టు ప్రకటన.. ధావన్‌ స్థానంలో పృథ్వీషా.. జట్టు ఇదే!!

IND VS NZ 2020 : Team India Squad For T20Is & ODI,Samson,Shaw Replaces Injured Dhawan ! || Oneindia
Prithvi Shaw Named In India Squad For New Zealand ODIs, Sanju Samson Replaces Injured Shikhar Dhawan In T20Is

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఒక మార్పు మినహా ఇటీవల ఆ్రస్టేలియాపై ఆడిన జట్టునే కొనసాగించారు. భుజం నొప్పితో బాధపడుతున్న సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ కివీస్‌ పర్యటనకు దూరమయిన విషయం తెలిసిందే. దీంతో గతంలోనే ప్రకటించిన టీ20 జట్టులో గబ్బర్‌ స్థానంలో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తీసుకున్నారు.

పృథ్వీ షాకు వన్డేల్లో అవకాశం:

పృథ్వీ షాకు వన్డేల్లో అవకాశం:

బీసీసీఐ సెలక్టర్లు యువ సంచలనం, ముంబై ఆటగాడు పృథ్వీ షాకు వన్డేల్లో తొలిసారిగా అవకాశమిచ్చారు. గాయపడిన ధావన్‌ స్థానంలో పృథ్వీ షాను ఎంపిక చేశారు. భారత్‌ తరఫున 2 టెస్టులు ఆడిన అనంతరం గాయాలు, డోపింగ్‌ నిషేధంతో పృథ్వీ క్రికెట్ ఆటకు దూరమయ్యాడు. అయితే ఇటీవలే పునరాగమనం చేసిన అతనికి వన్డేల్లో అవకాశం దక్కడం విశేషం. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో ఆదివారం జరిగిన ప్రాక్టీస్‌ వన్డే మ్యాచ్‌లో పృథ్వీ షా 100 బంతుల్లోనే 150 పరుగులు చేసాడు.

ధావన్‌ స్థానంలో శాంసన్‌:

ధావన్‌ స్థానంలో శాంసన్‌:

టీ20లకు దూరమైన ధావన్‌ స్థానంలో శాంసన్‌కు మరో అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన సంజునే ఇప్పుడు మళ్లీ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవలి కాలంలో వరుసగా పెవిలియన్‌కే పరిమితమై విండీస్‌తో మూడో టీ20 ఆడి 6 పరుగులు సాధించాడు. శాంసన్‌, పృథ్వీ షా ప్రస్తుతం కివీస్‌ పర్యటనలోనే ఉన్న భారత్‌ 'ఎ' జట్టులో సభ్యులుగా ఉన్నారు.

24న తొలి టీ20:

24న తొలి టీ20:

ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి వన్డే సిరీస్‌ జరుగుతుంది. ఫిబ్రవరి 5, 8, 11 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. గత ఏడాది న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్‌ను 4-1తో గెలుచుకొని.. టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. మంగళవారం భారత క్రికెట్‌ జట్టు కివీస్‌ గడ్డపై అడుగుపెట్టింది. ఆక్లాండ్‌ చేరుకున్నామంటూ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తెలిపాడు.

టీ20 జట్టు:

టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సంజు శాంసన్‌, లోకేష్ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్, మనీశ్‌ పాండే, రిషబ్ పంత్‌, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌.

వన్డే జట్టు:

వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, పృథ్వీ షా, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్‌ పాండే, రిషబ్ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌.

Story first published: Wednesday, January 22, 2020, 10:12 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X