న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్నారా?

Icc Cricket World Cup 2019 : How To Watch Icc World Cup Live Matches In UK ? | Oneindia Telugu
Preparing for summer rush: Now upload supporting documents online while applying for UK visa

హైదరాబాద్: ఈ ఏడాది మే 30 నుంచి జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే చాలు ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్ లాంటి దేశాల్లో అయితే క్రికెట్ మ్యాచ్‌ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వరల్డ్ కప్ జరుగుతున్నా భారత్ నుంచి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. అయితే, ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులు అక్కడికి వెళ్లేందుకు వీసాలు కావాలి.

<strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీని చూశారా? (వీడియో)</strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీని చూశారా? (వీడియో)

క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష్యంగా చూడాలనుకువారు

క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష్యంగా చూడాలనుకువారు

దీంతో వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష్యంగా చూడాలనుకువారు మార్చి 3 నుంచే వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని యూకే వీసా అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కోరారు. వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సంస్థ సహకారంతో యూకే వీసా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కొత్తగా ఆన్‌లైన్‌లో చెక్‌ అండ్‌ వెరిఫై సర్వీసును ప్రారంభించారు.

యుకే కాన్సులేట్‌లో వీసా

యుకే కాన్సులేట్‌లో వీసా

యుకే వెళ్లే అభిమానులు తమ దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను వీఎస్‌ఎఫ్‌ గ్లోబల్‌ ఈ స్కానింగ్‌ సర్వీస్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీంతో ఒరిజినల్‌ పత్రాలు లేకుండా కూడా కాన్సులేట్‌లో వీసా పొందవచ్చు. గతేడాది 6.3 లక్షల మంది యూకే వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు.

కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన యుకే

కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన యుకే

వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఈ కొత్త ప్రక్రియకు యుకే ఎమ్మిగ్రేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మే 30న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ కప్ జూలై 14న ముగియనుంది. ఈ సారి వరల్డ్‌కప్‌ను రౌండ్‌రాబిన్ పద్థతిలో నిర్వహిస్తున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది జట్లు ర్యాంకింగ్స్‌ ద్వారా నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ అర్హత టోర్నీ ద్వారా బెర్తులు సాధించాయి.

Story first published: Wednesday, February 27, 2019, 12:53 [IST]
Other articles published on Feb 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X