న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యేది ఇతడే!

Pravin Amre applies for position of Team Indias batting coach: Report

హైదరాబాద్: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవికి మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా మిడిలార్డర్‌ సమస్యను పరిష్కరించలేకపోయిన సంజయ్ బంగర్‌కు బీసీసీఐ మరో అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా లేదు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

అందుకు ప్రధాన కారణం మాంచెస్ట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ధోని ఏడో స్థానంలో రావడానికి బంగర్ సూచనే అని తెలుస్తోంది. ధోనీని ఏడో స్థానంలో బరిలోకి దింపమని జట్టు యాజమాన్యానికి అతడే ఆ సలహా ఇచ్చాడని అంటున్నారు. దీంతో బంగర్‌కు బీసీసీఐ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.

బంగర్‌లాగే ప్రవీణ్ ఆమ్రే కూడా బ్యాటింగ్‌లో మంచి రికార్డునే కలిగి ఉన్నాడు. టీమిండియా తరుపున 11 టెస్టులు, 37 వన్డేలాడిన ప్రవీణ్ ఆమ్రే తన టెస్టు మ్యాచ్ ఆరంగేట్రంలోనే దక్షిణాఫ్రికాపై 103 పరుగులతో సెంచరీతో చెలరేగాడు. దీంతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ నమోదు చేసిన 9వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ప్రవీణ్ ఆమ్రేకి బ్యాటింగ్ కోచింగ్ అనుభవం

ప్రవీణ్ ఆమ్రేకి బ్యాటింగ్ కోచింగ్ అనుభవం

దీంతో పాటు ప్రవీణ్ ఆమ్రేకి బ్యాటింగ్ కోచింగ్ అనుభవం కూడా ఉంది. 2012లో ఆమ్రే కోచింగ్ నేతృత్వంలోని అండర్-19 భారత జట్టు క్రికెట్ వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పూణె వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు సైతం బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారించాడు. దీంతో పాటు యుఎస్ఏ క్రికెట్‌కు బ్యాటింగ్ సలహాదారుగా కూడా పని చేస్తున్నారు. అంతేకాదు టీమిండియా క్రికెటర్లు అజ్యింకే రహానే, సురేశ్ రైనా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్ప వంటి వారికి బ్యాటింగ్ కోచ్‌గా చిట్కాలు నేర్పించారు.

బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న

బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న

మరోవైపు బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం భరత్‌ అరుణ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. "గత 18-20 నెలల్లో భరత్‌ అరుణ్‌ ఎంతో కష్టపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రస్తుతమున్న భారత బౌలింగ్‌ దాడే అత్యుత్తమం అని చెప్పొచ్చు. మహ్మద్‌ షమి గాడిలో పడేందుకు, జస్ప్రీత్ బుమ్రా నిలకడగా ఆడేందుకు అరుణ్‌ ఎంతో కృషి చేశాడు. కమిటీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ అతడి స్థానాన్ని భర్తీ చేయడమైతే సులభమైతే కాదు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఆగస్టు 2014లో బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు

ఆగస్టు 2014లో బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు

బంగర్‌ విషయంలో మాత్రం ఇలాంటి అభిప్రాయం లేదు. ఆగస్టు 2014లో బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ బంగర్ ఒకానొక సమయంలో హెడ్ కోచ్ రేసులో సైతం ఉన్నాడు. అయితే, 2016 జులైలో అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా నియమించిన బీసీసీఐ.... బంగర్‌ను తిరిగి బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఆ తర్వాత రవిశాస్త్రి హయాంలో కూడా బంగర్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగాడు.

సెమీస్‌లో టీమిండియా నిష్క్రమణ

సెమీస్‌లో టీమిండియా నిష్క్రమణ

ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా నిష్క్రమణతో సంజయ్ బంగర్‌‌పై కత్తి వేలాడుతోంది. మిడిలార్డర్‌లో మెరుగైన బ్యాట్స్‌మెన్‌ను తయారు చేయడం అతడి బాధ్యత. కానీ, టీమిండియాను ఎప్పటినుంచో వేధిస్తోన్న నెంబర్.4 సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటనను దృష్టిలో పెట్టుకొని రవి శాస్త్రి, బంగర్‌, భరత్‌, శ్రీధర్‌ పదవీకాలాన్ని పొడగించారు.

జులై 30 ఐదు గంటల్లోగా దరఖాస్తులు

జులై 30 ఐదు గంటల్లోగా దరఖాస్తులు

టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను కొత్తగా తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది.

Story first published: Monday, July 29, 2019, 15:44 [IST]
Other articles published on Jul 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X