న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని కొనియాడిన సక్లైన్ ముస్తాక్‌పై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం!

PCB Unhappy With Saqlain Mushtaq Over His Criticism Of BCCI And Praising MS Dhoni

కరాచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న మహీ ఓ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

అయితే ధోనీ రిటైర్మెంట్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవర్తించిన తీరు బాలేదని సక్లైన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత జట్టు ప్రస్తుత స్థితికి ధోనీనే కారణమని కొనియాడిన ముస్తాక్... ప్రతీ క్రికెటర్‌కు ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదన్నాడు. అలాగే ధోనీ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్‌, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి అంటూ ప్రశంసించాడు. ఇలా ధోనీని కొనియాడుతూ బీసీసీఐపై విమర్శలు చేయడం పట్ల పాక్ క్రికెట్ బోర్డు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నొచ్చుకోవద్దు..

నొచ్చుకోవద్దు..

ధోనీ వీడ్కోలు మ్యాచ్‌పై బీసీసీఐ తీరును తప్పుబడుతున్నందకు నొచ్చుకోవద్దన్నాడు. ‘నేనెప్పుడూ సానుకూల అంశాలు మాత్రమే మాట్లాడుతాను. నెగటివిటీని స్ప్రెడ్ చేయను. ఎవరిమీదా తప్పుగా మాట్లాడను. కానీ ధోనీ విషయంలో మాత్రం ఆగలేక ఇలా స్పందించాల్సి వస్తుంది. బీసీసీఐ ధోనీ వీడ్కోలు విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదు. ఇది ముమ్మాటికి బీసీసీఐ వైఫల్యమే. అతని వీడ్కోలు ఇలా ఉండాల్సింది కాదు. ఇది నా మనసులో నుంచి వచ్చిన మాట. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇలా అంటున్నందుకు బీసీసీఐకి క్షమాపణలు. కానీ మీ తీరుతో నేను బాధపడ్డా.'అని సక్లైన్ ముస్తాక్ చెప్పుకొచ్చాడు.

సక్లైన్ తీరు బాలేదు

సక్లైన్ తీరు బాలేదు

అయితే ధోనీని ప్రశంసిస్తూ.. బీసీసీఐపై విమర్శలు గుప్పించడంపై పీసీబీ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ బోర్డు వర్గాలు తెలిపాయి. భారత్‌తో సత్సంబంధాలు బాలేని సమయంలో ఆ జట్టు క్రికెటర్లు, బోర్డు గురించి మాట్లేడటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పీసీబీ తమ ఆటగాళ్లకు స్పష్టం చేసింది. ‘ధోనీని ప్రశంసిస్తూ.. బీసీసీఐపై విమర్శలు గుప్పించిన సక్లైన్ తీరుపై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ధోనీకి గ్రాండ్ ఫెర్‌వెల్ ఇవ్వకపోవడం గురించి సక్లెయిన్ ప్రస్తావించడం బాలేదు'అని ఓ పీసీబీ అధికారి మీడియాకు తెలిపారు.

యూట్యూబ్ చానెళ్లపై ఆంక్షలు..

యూట్యూబ్ చానెళ్లపై ఆంక్షలు..

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు చాలా మంది యూట్యూబ్ చానెళ్లు నడిపిస్తున్నారు. తమ చానెల్ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విషయాలపై స్పందిస్తున్నారు. అయితే ఎక్కువ భారత క్రికెట్ వ్యవహారాలపైనే ఆసక్తికనబరుస్తున్నారు. ఇది తమకు సమస్యకు మారుతుందని భావించిన పీసీబీ.. బోర్డుతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లు, కోచ్‌లు యూట్యూబ్ చానళ్లు నిర్వహించడానికి వీలు లేదని ఆదేశాలిచ్చిందంట. అంతేకాకుండా ఏ ఆటగాడైనా.. కోచ్ అయినా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే బోర్డు అనుమతి తీసుకోవాలని సూచించిందంట.

Story first published: Wednesday, August 26, 2020, 14:30 [IST]
Other articles published on Aug 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X