న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్‌ మాలిక్‌కు బిగ్ షాక్.. పోమ్మనలేక పొగ పెడుతున్న పీసీబీ!!

PCB Drops Shoaib Malik for upcoming T20I series against New Zealand

కరాచీ: న్యూజిలాండ్‌లో పర్యటించే పాకిస్థాన్‌ జట్టులో చోటు ఆశించిన వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ షోయబ్‌ మాలిక్‌, పేసర్‌ మహ్మద్‌ ఆమీర్‌కు చుక్కెదురైంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) బుధవారం ప్రకటించిన 35 మంది సభ్యుల బృందంలో వీరికి స్థానం దక్కలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసమే 38 ఏళ్ల మాలిక్, 28 ఏళ్ల ఆమీర్‌‌లను పక్కనబెట్టినట్టు సమాచారం తెలుస్తోంది. పాకిస్థాన్‌ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్‌ ఆజామ్‌ను నియమించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని ఫార్మాట్లకు బాబర్‌ కెప్టెన్ అయ్యాడు.

35 మంది సభ్యుల బృందంలో నుంచి జాతీయ పురుషుల జట్టు, షాషీన్స్ ‌(పాకిస్థాన్‌ ఏ టీమ్‌) జట్లను ఎంపిక చేస్తారు. 20 మంది సహాయ బృందంతో పాటు ఆటగాళ్లు నవంబర్‌ 23న లింకన్‌ (న్యూజిలాండ్‌) బయలుదేరనున్నారు. అక్కడే 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తిచేయనున్నారు. డిసెంబరు 18న ప్రారంభంకానున్న ఈ పర్యటనలో పాకిస్థాన్‌ మూడు టీ20లు, రెండు టెస్టులను ఆడనుంది.

అన్ని ఫార్మట్‌లకు గుడ్‌బై చేప్పిన షోయబ్‌ మాలిక్ కేవలం టీ20 క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో మాలిక్‌కు చోటు దక్కలేదు. మాలిక్‌ను తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు కూడా పక్కనబెట్టారు. తాజా పరిణామంతో అతను వచ్చే ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేది అనుమానంగా మారింది. ఇలా మాలిక్‌కు పీసీబీ చోటు కల్పించకపోవడం.. పోమ్మనలేక పొగ పెడుతున్నట్టే ఉంది. వీడ్కోలు ఇవ్వమని నేరుగా అతనికి చెప్పలేక.. పీసీబీ పెద్దలు ఇలా చేస్తున్నారు. 38 ఏళ్ల మాలిక్‌ గత పదిహేనేళ్ళుగా పాక్ క్రికెట్‌కు సేవలందిస్తున్నాడు.

భారత టెన్నిస్ స్టార్ ఫ్లేయర్ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్. పాక్‌స్తాన్ జట్టులో సీనియర్ ఆటగాడి ఉన్న మాలిక్, తన క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ చెప్పిన తర్వాత భార్య సానియాతో కలిసి భారత్‌లో ఉంటారా లేక పాక్‌లోనే ఉంటారా అనే దానిపై అభిమానులు చర్చికుంటున్నారు. ఈ దంపతులు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సానియా హైదరాబాద్‌లోనే ఉంటోంది.

పాకిస్తాన్ vs న్యూజిలాండ్ షెడ్యూల్:

18 డిసెంబర్ - తొలి టీ20, ఈడెన్ పార్క్, ఆక్లాండ్

20 డిసెంబర్ - రెండో టీ20 సెడ్డాన్ పార్క్, హామిల్టన్

22 డిసెంబర్ - మూడో టీ20 మెక్లీన్ పార్క్, నేపియర్

26-30 డిసెంబర్ - మెుదటి టెస్ట్, బే ఓవల్, మౌంగనుయ్

3-7 జనవరి - రెండో టెస్ట్, హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్

IPL 2020: కోహ్లీ, పాంటింగ్ మధ్య గొడవ.. అసలు కారణమేంటో చెప్పిన అశ్విన్!!IPL 2020: కోహ్లీ, పాంటింగ్ మధ్య గొడవ.. అసలు కారణమేంటో చెప్పిన అశ్విన్!!

Story first published: Thursday, November 12, 2020, 15:41 [IST]
Other articles published on Nov 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X