తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో: పపువా న్యూ గునియా ఎలా అర్హత సాధించిందో తెలుసా?

హైదరాబాద్: పపువా న్యూ గునియా 178,700 చదరపు మైళ్లతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ద్వీప దేశం. ఆస్ట్రేలియాకు పైభాగంలో ఉంటుంది. దేశ జనాభా మొత్తం సుమారు 81 లక్షలు. ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్‌‌లో ఓనమాలు నేర్చుకుంటుంది. అలాంటిది వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించింది.

దుబాయి వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆదివారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన పపువా న్యూ గునియా టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌కు పపువా న్యూ గునియా అర్హత సాధించడం ఇదే తొలిసారి. దీంతో ఆ దేశ ప్రజలు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

స్కాట్లాండ్ చేతిలో నెదర్లాండ్ జట్టు ఓడిపోవడం కూడా పపువా న్యూ గునియాకు కలిసొచ్చింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో గ్రూప్ ఏలో పపువా న్యూ గునియా నెట్ రన్‌రేట్ విషయంలో నెదర్లాండ్స్ కంటే ముందంజలో ఉంది. గ్రూప్ ఏ నుంచి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించింది.

కోచ్ జో డావ్స్ వల్లే

కోచ్ జో డావ్స్ వల్లే

పపువా న్యూ గునియా కోచ్ జో డావ్స్ భారత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ మాజీ క్రికెటర్ 2012-2014 మధ్య కాలంలో భారత బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. అప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా డంకన్ ప్లెచర్ ఉన్నారు. 2014లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 1-3తో సిరిస్‌ను చేజార్చుకోవడంతో బౌలింగ్ కోచ్‌తో పాటు ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్సీలను బీసీసీఐ తొలగించింది. ఆ తర్వాత జో డావ్స్ పపువా న్యూ గునియా జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతడి నేతృత్వంలో పపువా న్యూ గునియా జట్టు రాటు దేలింది. ఇప్పుడు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కోచ్ జో డావ్స్ మాట్లాడుతూ "నేను భావోద్వేగానికి గురవుతున్నాను. ఇది జట్టుకు చాలా పెద్దది. దీనిని సాధించడానికి జట్టుకు రెండు సంవత్సరాలు పట్టింది" అని అన్నాడు.

క్రికెట్ కొత్త కాదు

క్రికెట్ కొత్త కాదు

పపువా న్యూ గునియా ప్రజలకు క్రికెట్ కొత్త కాదు. బ్రిటిష్ మిషనరీస్ ఆధిపత్యంలో ఉన్న సమయంలోనే 90 దశకాల్లో ఈ దేశానికి క్రికెట్‌ను పరిచయం చేశారు. అయితే, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రపంచ క్రికెట్‌ను

ఆకర్షించడంలో వెనుకబడ్డారు. 2014లో పపువా న్యూ గునియాకు వన్డే హోదా లభించింది. ఎమర్జింగ్ నేషన్ కింద ఐసీసీ సైతం ఈ దేశానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. అయితే, 2018లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా వన్డే హోదాను కోల్పోయింది. మళ్లీ ఈ ఏడాది తిరిగి వన్డే హోదాను నిలబెట్టుకుంది.

పపువా న్యూ గునియా గురించి

పపువా న్యూ గునియా గురించి

పపువా న్యూ గునియా నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. రాజధాని పోర్ట్ మోర్స్బీ. కామన్వెల్త్‌లో సభ్యదేశం కూడా. భౌగోళికంగా ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉంది. కేవలం 80 లక్షలకు పైగా జనాభా ఉండే ఈ దేశం 851 భాషలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక భాషలను కలిగి ఉన్న దేశం ఇదే. జేమ్స్ మరాపే ఈ దేశం యొక్క ప్రధాన మంత్రి.

పపువా న్యూ గునియా క్రీడల చరిత్ర

పపువా న్యూ గునియా క్రీడల చరిత్ర

ఈ ద్వీప దేశంలోని ప్రజలు ఎక్కువగా అనుసరించే క్రీడ రగ్బీ. పపువా న్యూ గునియాకు చెందిన ఎంతో మంది రగ్బీ ఆటగాళ్లు ఆస్ట్రేలియన్ లీగ్‌లలో కనిపిస్తారు. ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ మరియు బాక్సింగ్ కూడా ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందాయి. 20వ శతాబ్ధం నుంచి ఈ దేశంలోని ప్రజలు క్రికెట్‌ను ఎక్కువగా అనుసరిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు పపువా న్యూ గునియా అర్హత సాధించడంతో అక్కడ క్రికెట్‌కు ఇంకా అదరణ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషుల క్రికెట్ జట్టుకు బర్రాముండిస్ అని మారుపేరు ఉంది. బర్రాముండిస్ అంటే ఈ ప్రాంతంలో లభించే ఫేమస్ చేప జాతి పేరు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, October 28, 2019, 13:57 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X