న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DRS issue Of Pant: మినిమం కామన్ సెన్స్ లేదు... బ్రెయిన్ ఉన్నవాళ్లెవరూ ఇలా చేయరు అంటూ రవిశాస్త్రి ఫైర్

ravi shastri

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్ పోటీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ ఓడిపోవడంలో ప్రధాన కారణం కెప్టెన్ రిషబ్ పంత్. 20 ఓవర్లలో 159/7తో మంచి పోటీనిచ్చే స్కోరు ముంబై ముందు ఢిల్లీ ఉంచగలిగింది. అందుకు అనుగుణంగానే డిఫెండ్ చేసుకునేలా బౌలింగ్ తో కూడా 15వ ఓవర్ వరకు పోరాడింది. 16ఓవర్ తొలిబంతికి టిమ్ డేవిడ్‌ కీపర్ క్యాచ్ అవుట్ అవ్వాల్సింది. కానీ రిషబ్ పంత్ డీఆర్ఎస్ తీసుకోకపోవడంతో భారీ నష్టం జరిగిపోయింది.

pant

అలాంటి డౌట్ వచ్చినప్పుడు డీఆర్ఎస్ తీసుకోవాల్సింది

అంతా డౌట్ ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకోకుండా ఉండడంపై పంత్ మీద కామెంట్లు, ట్రోల్స్ పెరిగాయి. పంత్ చేసిన ఆ మిస్టేక్ వల్ల టిమ్ డేవిడ్ బతికిపోవడమే కాదు ఢిల్లీని చావుదెబ్బ తీశాడు. కేవలం 11 బంతుల్లోనే 34పరుగులతో ఎడాపెడా సిక్సులు బాదుతూ.. ఢిల్లీ గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై గెలిచేలా చేసిఅద్భుతమైన స్కోరు సాధించి, గేమ్‌ను ఢిల్లీ నుంచి దూరం చేసింది. అంతా డౌట్ వచ్చినప్పడు పంత్ డీఆర్ఎస్ తీసుకోవాల్సిందంటూ నెటిజన్లతో పాటు క్రికెట్ ప్రముఖులు సైతం పేర్కొంటున్నారు.

pant

డైరెక్ట్ డీఆర్ఎస్ తీసుకోవాల్సిన సందర్భం

ఇక ఈ విషయమై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. అవకాశమున్నా పంత్ సమీక్షను తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేరుగా డీఆర్ఎస్ సమీక్ష తీసుకోవాల్సింది. కానీ కనీసం కామన్ సెన్స్ కూడా ఉపయోగించలేదు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'అక్కడ డైరెక్ట్ డీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం. కామన్ సెన్స్ ఏం చెబుతుందో చూడాలి. అక్కడ రిషబ్ పంత్ ఉన్నాడు, శార్దూల్ ఉన్నాడు ఒకవేళ వాళ్లకు థాట్ రాకపోతే మిగతావాళ్లు ఏం చేస్తున్నారు? అంటూ శాస్త్రి ప్రశ్నించాడు.

rs

కొంచెమన్న కామన్ సెన్స్ ఉండాలి
కామన్ సెన్స్ ప్రకారం 5ఓవర్లు మిగిలి ఉండగా ఇంకా 2సమీక్షలు ఉన్నాయి. అలాంటప్పుడు డీఆర్ఎస్ తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా టిమ్ డేవిడ్ లాంటి హిట్టర్ ఉన్నప్పుడు తప్పకుండా తీసుకోవాల్సింది. ఒకవేళ డీఆర్ఎస్ తీసుకున్నట్టయితే అతను ఔటయ్యేవాడు. వెనువెంటనే రెండు వికెట్లు పడితే తప్పకుండా బ్యాటింగ్ జట్టుపై ప్రెషర్ పడుతుంది. ఇంకా ఐదు ఓవర్లే మిగిలి ఉండడంతో పైచేయి సాధించే వీలవుతుంది. డీఆర్ఎస్ తీసుకోకపోవడం అంటే బ్రెయిన్ పని చేయని వాళ్లు చేసిన పనే' స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ అనంతర షోలో రవిశాస్త్రి చెప్పాడు.

Story first published: Sunday, May 22, 2022, 22:55 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X